1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
  4. బేబీ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటా: శ్రియ

బేబీ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటా: శ్రియ

శ్రియ అందంపై బేబీ ఆయిల్ మసాజ్ ఆరెంజ్ జ్యూస్ చేపలు
రోజురోజుకూ సినీ పరిశ్రమలో పెరుగుతున్న పోటీ నేపధ్యంలో శ్రియ తన అందంపై మరింత శ్రద్ధ పెట్టిందట. వైద్యుల సలహా మేరకే తిండి తింటోందట. దీంతో ఒక్కసారిగా నెలలోపే తన అందం రెట్టింపయిందట. తమిళ సినిమా కుట్టి చిత్రం షూటింగ్ కు శ్రియ వస్తుంటే యూనిట్ సభ్యులందరూ ఆశ్చర్య పోయారట. అక్కడే ఉన్న ఓ సినీ కుర్ర జర్నలిస్టు... శ్రియ అందంపై అరడజను ప్రశ్నలు సంధించాడట.

ఆమె అందం గురించి అడిగే ముందే... అప్సరసలా ఉన్నారంటూ కితాబిచ్చాడట. దీంతో శ్రియ సంబరిపడిపోతూ... నేనే..? అప్సరసలా ఉన్నానా...? హ.. హ్హ... హ్హ్హ... అంటూ విరగబడి నవ్విందట. ఆ తర్వాత అతగాడు అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానాలు చెప్పుకొచ్చింది.

ఉదయాన్నే ఏం తీసుకుంటారు...?
ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్

డైట్...?
చేపలు, కూరగాయలు, చెన్నై పప్పు తింటాను

శరీర మృదుత్వానికి...?
బేబీ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటా

ముఖ సౌందర్యం కోసం...?
గ్లిజరిన్ కలిపిన గులాబ్ జాల్‌తో ముఖం కడుక్కుంటా...

అందాన్ని పెంచుకునేందుకు అనుసరించే చిట్కాలు..?
అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు

కాంతివంతమైన శరీరం కోసం...?
కొబ్బరి నీళ్లు తాగుతా...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT