అది ఒన్సైడ్ లవ్: శర్వానంద్
|
ప్రశ్న.. గమ్యం చిత్రం మీ నట జీవితానికి ఎటువంటి మలుపునిచ్చింది?
జ.. ఇంతకుముందు ఐదో తారీఖు, వెన్నెల, అమ్మ చెప్పింది, వీధి చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు లభించింది. వీటిల్లో వెన్నెల చిత్రాన్ని చేస్తున్నప్పుడే దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్) గమ్యం చిత్రంలో నటించడానికి ఆఫర్ ఇచ్చారు. నటుడిగా మంచి మార్కులు.. గమ్యం సినిమా విడుదలకాక ముందే లభించాయి. అలాగే నా కెరీర్‌కు ఈ చిత్రం ప్లస్ పాయింట్ అయింది.
ప్రశ్న.. తమిళంలో 'గమ్యం' ఎలాంటి ఆదరణ చూరగొంది..?
జ... కోలీవుడ్‌లోనూ నటుడిగా గుర్తింపు లభించింది. ఎటువంటి మార్పులు లేకుండా చేశాం. తెలుగులో కంటే తమిశ వర్షన్‌లో ఎక్కువ కష్టపడ్డాను. అటువంటి కథలు యూనివర్శల్. మళ్ళీ అటువంటి కథలు వస్తే చేయడానికి రెడీగా ఉన్నాను.
ప్రశ్న.. అవార్డు చిత్రాల్లో నటించే ఆలోచన ఉందా..?
జ.. తప్పకుండా రావాలేగానీ చేస్తాను.
ప్రశ్న... మీ అభిమాన నటుడు?
జ.. పద్మశ్రీ కమల్ హాసన్. ఆయన నటన స్ఫూర్తితోనే "అమ్మచెప్పింది"లో నేను అమాయకుడి పాత్ర పోషించాను.
|
జ.. "కాశీ" చిత్ర దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో 'నాళై ఎనదే' చిత్రంలో చేస్తున్నాను. దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటున్నాను. ఈలోగా తెలుగులో మూడు చిత్రాలు చేయాల్సి ఉంది.
ప్రశ్న.. మోహన్‌బాబు కాంబినేషన్‌లో చేస్తున్న రాజుమహారాజు గురించి..?
జ.. క్రమశిక్షణకు మారు పేరైన మోహన్‌బాబుతో చేయాలంటే అందరూ భయపడుతుంటారు. ఆయనకు తగ్గట్టుగానే నాకూ షూటింగ్ 7 గంటలకైతే, మేకప్‌తో ఆరు గంటలకే రెడీగా ఉండేవాడ్ని. తొలి సన్నివేశంలో నేను డైలాగ్‌లు తప్పు చెబితే మోహన్‌బాబు సరిచేశారు. సెట్లో అందర్నీ నవ్విస్తూ ఆటపట్టిస్తూ ఉంటారు. దాంతో ఎన్నిరోజులు షూటింగ్ చేశామనేదే మర్చిపోతాం.
ప్రశ్న.. నిజ జీవితంలో ప్రేమలో పడ్డారా..?
జ.. ఇంటర్‌మీడియట్ చదువుతుండగానే ప్రేమించాను. అది ఒన్‌సైడ్‌లవ్. ఆ తర్వాత ఆమెకు పెళ్ళైందని తెలిసింది. అది మినహా ఇంతవరకు ఎవర్నీ ప్రేమించలేదు.
ప్రశ్న.. తెలుగులో చేస్తున్న కొత్త చిత్రాలు..?
జ... నా పుట్టినరోజు నాడు చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం కానుంది. అదికాకుండా మరో రెండు చిత్రాలు కూడా రెడీగా ఉన్నాయి. కానీ ఇంకా ఫైనల్ కాలేదు.
ప్రశ్న.. డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా..?
జ.. నెగటివ్ రోల్స్ చేయాలని ఉంది. అదికూడా ప్రాధాన్యత గల పాత్రలే చేయాలి. "నిజం"లో గోపిచంద్ చేసినటువంటి ప్రాధాన్యతగల పాత్రలా ఉండాలి. అలాగే అగ్రహీరోలతో కలిసి పనిచేయాలనుంది.
