1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

ఆల్ రౌండర్ అనిపించుకోవాలి: సుశాంత్

వినోదం వెండితెర ముఖాముఖి ఆల్ రౌండర్ కాళిదాసు కరెంట్ సుశాంత్ అక్కినేని నాగార్జున నాగేశ్వరరావు నాగ చైతన్య
WD
"కాళిదాసు"తో నటునిగా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సుశాంత్ లేటెస్ట్‌గా కరెంట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

తాత అక్కినేని నాగేశ్వరరావు తనకు రోల్ మోడల్ అని అంటున్న సుశాంత్, మామయ్య అక్కినేని నాగార్జున నటునిగా ఇన్‌స్పిరేషన్ అని చెబుతున్నాడు.

ప్రస్తుతం వారసత్వ నటనలో ఉన్నా, నేటి యూత్ నటులకు పోటీ ఉందని, అది కూడా ఆరోగ్యకరంగా ఉందని పేర్కొంటున్నాడు. తొలి చిత్రంలో తమన్నా సుశాంత్ సరసన నటించగా, తాజా చిత్రం "కరెంట్"లో స్నేహా ఉల్లాల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో ప్రత్యేకమైన ఓ పాటలో మరో హీరోయిన్ నటించనుంది.

ఆ హీరోయిన్ ఎవరో త్వరలో చెబుతానంటోన్న సుశాంత్‌కు ఈ నెల 18వ తేదీన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు తెలియజేస్తున్నారు.

ప్రశ్న.. ఇది మీకు ఎన్నో పుట్టినరోజు..?
జ.. నటునిగా ఈ రంగంలోకి వచ్చాక చేసుకుంటోన్న తొలి పుట్టినరోజు. కాళిదాసు చిత్రానికి ముందు నేను ఎవరో సరిగ్గా తెలీదు. ఆ చిత్రంతో సుశాంత్ పర్వాలేదనిపించుకున్నాడు. ఈ పుట్టినరోజు నటునిగా కాస్త బాధ్యతను గుర్తుచేస్తుంది.

ప్రశ్న.. ఈ పుట్టినరోజును ఎలా జరుపుకుంటున్నారు?
జ.. అన్నపూర్ణ స్టూడియోలోనే తాతగారి సమక్షంలో జరుపుకుంటాను. ఇప్పటికే అభిమానులు చాలామంది ఫోన్లు చేసి మిమ్మల్ని కలవాలనుకుంటున్నామని చెప్పారు.

ప్రశ్న.. తొలి చిత్రానికి కరెంట్ సినిమాకు తేడా ఏమిటి?
జ.. తొలి సినిమా చాలా హెవీ పాత్ర. అందులో లవ్ పాళ్ళు తక్కువ. యాక్షన్, మాస్ చిత్రం. కానీ ఈ చిత్రంలో లవ్‌కు ప్రాధాన్యత ఉంది. కమర్షియల్ అంశాలు చాలా ఉన్నాయి.

ప్రశ్న.. మీ తాతగారి నుంచి మీ వరకు రొటీన్ లవ్ చిత్రాలేనా? మీ నుంచి కొత్తదనం రాదా?
జ.. ప్రేమ అనేదానికి చావులేదు. ఏ చిత్రంలోనైనా ఉంటుంది. ఎంత యాక్షన్ చిత్రమైనా అందులో కాస్తో కూస్తో ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే.. లవ్ అనేది నేటిట్రెండ్‌కు తగినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు.

WD
ప్రశ్న.. నటునిగా చైతన్యకు మీకు ఎటువంటి పోటీ ఉంటుందని భావిస్తున్నారు?
జ.. పోటీ అనేది లేదు. ఇక్కడంతా హెల్తీ వాతావరణం. అలాగే ఇతర నటులుకూడా. ఎవరి శైలిలో వారు నటిస్తారు.

ప్రశ్న.. మీ ఇద్దరు కలిసి నటించే ఆలోచన ఏమైనా ఉందా..?
జ.. మేమిద్దం కలిసి ముంబైలో యాక్టింగ్ కోర్సు చేశాం. అక్కడ కొన్ని సీన్స్‌లో కలిసి నటించే వాళ్ళం. ఇద్దరూ జిమ్నాస్టిక్ నేర్చుకున్నాం. ఫైట్స్ నేర్చుకున్నాం. కానీ సినిమాలో కలిసి నటించే ఆలోచన ఇప్పట్లో లేదు.

ప్రశ్న.. యూత్ 6 ప్యాక్ బాడీపై శ్రద్ధ చూపుతున్నారు? మరి మీరు?
జ.. అన్నిటికీ అది సూట్ కాదు. పాత్రను బట్టి పెంచుకోవడం కరెక్టే.

ప్రశ్న.. డైలాగ్ డెలీవరిలో మెరుగు కనబరుస్తున్నారా..?
జ.. మొదటి చిత్రంలో బాగానే చెప్పాను అన్నారు. కానీ కాస్త మాడ్యూలేషన్ మెరుగుపర్చుకోవాలని అప్పుడు అనిపిస్తుంది. ఆ లోటు ఈ చిత్రంలో పూర్తి చేశారు. అయినా ఫాస్ట్‌గా సాగే డైలాగ్‌లో ఈ ఇబ్బంది ఉండదనుకుంటున్నా.

ప్రశ్న.. డూప్స్ లేకుండా ఫైట్స్ చేశారని చెప్పారు? మొదట్లోనే సాహసం చేయడానికి కారణం?
జ.. నేచురాలిటీ కోసం అలా చేశాను. కానీ బాగా కష్టమైనవి కాదు. ఒకరకంగా డూప్ లేకుండా చేస్తే అందులో ఉన్న ఆనందం భలేగుంటుంది. ఆ ఫీలే వేరు.

ప్రశ్న.. మీలో ప్రత్యేకత ఏమనుకుంటున్నారు?
జ.. చేసే కొద్ది ఏర్పడేది ప్రత్యేకత ఏర్పడుతుందని భావిస్తాను. ఇంకా 2, 3 చిత్రాలు చేస్తే నా ప్రత్యేకత ఏమిటో మీకే తెలుస్తుంది.

ప్రశ్న.. ఫ్యామిలీ ప్రభావం ఎలా ఉంది?
జ.. తాతగారు నాకు రోల్‌మోడల్. ఆయన హార్డ్‌వర్క్ చేసి పైకి వచ్చారు. నటునిగా ఇన్‌స్పిరేషన్ మామయ్యే. ఒకరిని చూసి కాపీ చేయొద్దు. నీ కంటూ ఓ ప్రత్యేకత ఉండాలని మామయ్య చెబుతుండేవాడు.

ప్రశ్న.. ప్రస్తుతం కమిట్ అయిన చిత్రాలు?
జ.. ఇంకా ఏమీ కాలేదు. 4, 5 కథలు మాత్రం విన్నాను.

ప్రశ్న.. మీ గోల్ ఏమిటి?
జ.. అన్ని రకాల పాత్రలు పోషించి ఆల్‌రౌండర్ అనిపించుకోవాలన్నదే..!

మరి మనం కూడా సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అనుకున్న గోల్ రీచ్ కావాలని ఆశిద్దామా.. ఆల్ ది బెస్ట్ సుశాంత్..!
About Writer
SELVI.M