Romance is very Difficult : Ajay | రొమాన్స్ చేయడం చాలా కష్టం: అజయ్
|
అనంతరం 35 చిత్రాల్లో అజయ్ విలన్‌గా నటించాడు. ఇవన్నీ అగ్రదర్శకుల చిత్రాలే కావడం విశేషం. "లక్ష్మీ కళ్యాణం"లో అజయ్ పాత్రను చూసిన కణ్ణన్ అనే దర్శకుడు సారాయి వీర్రాజు చిత్రంలో హీరోగా అవకాశం కల్పించాడు. అంతకుముందే మూర్తి అనే దర్శకుడు "ఆ ఒక్కడు" చిత్రంతో అజయ్‌ను తెరపైకి తెచ్చాడు. ఈ చిత్రం పూర్తయి ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ సందర్భంగా అజయ్‌తో కాసేపు..
ప్రశ్న... విలన్, హీరోగా ఎటువంటి తేడా గమనించారు?
జ.. నెగటివ్ రోల్స్ చేయడం చాలా ఈజీ. కానీ హీరోగా చేయడం, అందులో హీరోయిన్లతో రొమాన్స్ చేయడం చాలా కష్టం. మొదటిరోజు అలాంటి సన్నివేశాల చిత్రీకరణకు నా బాడీ సెట్‌కాలేదు. పాత్రను బట్టి ఫీలింగ్‌లు సాఫ్ట్‌గా ఉండాలి. దానికోసం చాలా కష్టపడ్డాను. కానీ విలన్ పాత్ర అయితే కొద్ది సీన్స్‌కే పరిమితం. అదే హీరో అయితే సినిమా మొత్తం కనబడాలి. ఆ దిశగా నా వంతు కృషి చేశాను.
ప్రశ్న... హీరోగా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందనను ఆశిస్తున్నారు?
జ.. నాక్కూడా టెన్షన్‌గా ఉంది. ఇప్పటిదాకా విలన్‌గా చేసిన అజయ్ హీరోగా ఏం చేస్తాడో? చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది. అది నాలోనూ ఉంది. అయితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకముంది.
ప్రశ్న.. ఇకపై విలన్‌పాత్రలకు ఫుల్‌స్టాప్ పెడతారా?
జ.. లేదు. నెగటివ్ పాత్రలుకూడా చేస్తాను. ఆర్య-2, యాగం, సైయాట చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ చేస్తున్నాను.
ప్రశ్న.. హీరోగా చేస్తుండగా విలన్ పాత్రలేమైనా వదులుకున్నారా?
జ.. దాదాపు 5 సినిమాలు వదులుకున్నాను. తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల ఆఫర్లు వచ్చాయి. వాటిని వదులుకున్నాను. ఇప్పుడు పత్రికా ముఖంగా చెబుతున్నాను. విలన్‌గా పాత్రలకు ఫుల్‌స్టాఫ్ పెట్టను. ఎలాంటి పాత్రలో నటించేందుకైనా నేను సిద్ధమే.
ప్రశ్న.. ప్రాధాన్యత గల పాత్రలకే ముఖ్యత్వం ఇస్తారని రాజమౌళి అన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జ.. అది కరెక్టే.. ఏ డైలాగ్ లేకుండా చేసే పాత్రలు అసలు నచ్చవు. "సింహాద్రి"లో నాకు అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆ మాట అన్నాను. ఆ మాటను ఆయన గుర్తుచేసుకుని ఆడియో ఫంక్షన్‌లో అన్నారు. ఆయన మెమొరికీ హ్యాట్సాప్ చెబుతున్నాను. నేను ఈ స్థితికి రావడానికి రాజమౌళి కారణం. ఇప్పటివరకు ఎందరో గొప్ప దర్శకుల దగ్గర పనిచేశాను.
ప్రశ్న... "ఆ ఒక్కడు" ఏం చేస్తాడు?
జ.. సురేష్ గోపి లాయర్. ఆయన దగ్గర పనిచేస్తాను. అక్కడే లా గురించి తెలుసుకుంటాను. ఆ క్రమంలో హీరోయిన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఆ ఒక్కడు ఏం చేస్తాడని తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
ప్రశ్న.. ఈ చిత్రంలో ప్రత్యేకతలేమిటి?
జ.. ఆ ఒక్కడు స్క్రీన్‌ప్లే బేస్డ్ చిత్రం. టెక్నీషియన్స్ సినిమా. దీనికోసం 9 నెలలు కష్టపడ్డాం. టాలీ టు హాలీ నిర్మాతలు సుధాకర్, గణేష్ ఎంతో నమ్మకంతో నాకు అవకాశం కల్పించారు. ఓవర్‌సీస్‌లో వారిది విజయవంతమైన డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం. ఈ చిత్రం వారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.
