Nagarjuna is searching for Story | ఇంకా కథ దొరకలేదు: నాగార్జున
"కింగ్" సినిమా ద్వారా మాస్‌ను ఆకట్టుకున్న అక్కినేని నాగార్జున కొత్త కథ కోసం అన్వేషిస్తున్నారు. టాలీవుడ్‌లో యువసామ్రాట్‌గా ముద్రవేసుకున్న నాగార్జున శుక్రవారం తన మేనల్లుడు సుశాంత్ నటించిన "కరెంట్" సినిమా టైటిల్ సాంగ్‌ను తన చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ్‌ను కదిలిస్తే..
ప్రశ్న.. మీ తదుపరి చిత్రం గురించి..?
జ.. కథలు ఇంకా దొరకడం లేదు. మంచి కథ దొరికితే తప్పకుండా చెప్తాను.
ప్రశ్న.. మీరు చేయబోయే తదుపరి చిత్రంపై పలు కథనాలు వస్తున్నాయి. వాటిపై మీ స్పందన?
జ.. నా తర్వాతి చిత్రం గురించి కథనాలు రావడం సహజమే. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మా కుటుంబంలోని అందరినీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా సుమంత్ "కరెంట్" చిత్రంతో వస్తుంటే, రేపు నాగచైతన్య హీరోగా వస్తున్నాడు. వీరందరికి కథలు దొరికి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. నేనే... కథ దొరక్క ఖాళీగా ఉన్నాను (అంటూ హాస్యోక్తులు విసిరారు).
ప్రశ్న.. ఎన్నికలపై మీ స్పందన?
జ.. ఈ మధ్య రాజకీయ హడావుడి ఎక్కువైంది. దీంతో ఇంటర్వ్యూలు కూడా ఎక్కువయ్యాయి. అంతా ఎవరికి ఓటు వేస్తారంటూ.. తెగ అడిగేశారు. ఏ పార్టీ గెలుస్తుందంటూ.. నేనేదో భవిష్యత్ చెప్పేవాడిలా ట్రీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక మనస్సు ఇప్పుడే చాలా హాయిగా ఉంది.