1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. Raghavendra rao

Sunil, Maryada ramanna| Raghavendra rao| Raja mouli | నాకు అందరు హీరోలు పోటీనే: సునీల్

సునీల్
WD
"నాది నాది అన్నది నీదు కాదురా.. నేడు రాయి అన్నది ఒక నాటికి రత్నమవురా.." అని సినీ కవి అన్నట్లు ఏది మన చేతుల్లో లేదు. అంతా పైవాడిదయ.. అనేది సినీ ఇండస్ట్రీలో కాదనలేని సత్యం. నటుడు సునీల్ కూడా ఇదే అంటున్నారు.

"చిత్రం" సినిమాలో యూత్ నంటూ.. డైలాగ్‌తో తెరంగేట్రం చేసిన సునీల్ ఆ తర్వాత హీరో స్నేహితుడిగా నటిస్తూ.. కామెడీ ఆర్టిస్టుగా.. హీరో స్థాయికి ఎదిగాడు. అయినా తన నేపథ్యాన్ని మర్చిపోనని అంటున్న సునీల్ తాజాగా కె. రాఘవేంద్రరావు సంస్థ నిర్మించే "మర్యాద రామన్న" చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఇందులో విశేషమేమిటంటే..? ఈ సినిమాలోని తన పాత్ర కోసం సునీల్ దాదాపు 10 కేజీల బరువును తగ్గించుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా జరిపిన చిట్‌చాట్..

ప్రశ్న.. నేటి హీరోలతో పోటీపడడానికి బాడీ తగ్గించుకున్నారా?
జ.. నవ్వుతూ.. నాకు రాజమౌళి కథ చెప్పినప్పుడే పాత్రపరంగా కాస్త లావు తగ్గాలన్నారు. ఆయన కొద్దిమేరకే తగ్గాలని చెప్పినా నేను కాస్త ఎక్కువే తగ్గాను. దానికోసం తగిన వ్యాయామాలు చేస్తున్నాను. ఏదో టాబ్‌లెట్ వేసుకుని తగ్గలేదు.

ప్రశ్న.. మరి ఇతర చిత్రాల్లో నటించడానికి ఇబ్బంది కలగలేదా?
జ.. కలిగింది. దాదాపు డిసెంబర్ నుంచి నేను బరువు తగ్గడంపై శ్రద్ధపెట్టాను. అప్పటి నుంచి 4, 5 సినిమాలు వాయిదా వేస్తూ వచ్చాను. నాపై నమ్మకంతో నిర్మాత దర్శకులూ సహకరించారు. ఈలోగా ఆయా హీరోలపై సన్నివేశాలు చిత్రించారు. ఇంకా కొద్దిపాటి వర్క్ మిగిలి ఉంది. దాదాపు అదికూడా పూర్తిచేస్తాను.

ప్రశ్న... రాఘవేంద్రరావు పతాకంపై నటించడం పట్ల ఎలా ఫీలవుతున్నారు?
జ.. అసలు ఈ బేనర్‌లో నటిస్తానని అనుకోలేదు. ఒకసారి రాజమౌళి తనను పిలిచి కథ చెప్పారు. ఆల్‌రెడీ స్టూడెంట్ నెంబర్.1 సినిమా సమయంలో రాఘవేంద్ర రావు పతాకంపై చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో వాయిదా పడింది. కానీ ఆ సమయంలో మర్యాద రామన్నగా వేరే హీరోను అనుకున్నారు. అది సాధ్యపడకపోవడంతో చివరికి అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చింది.

ప్రశ్న... అందాలరాముడు తర్వాత హీరోగా గ్యాప్ రావడానికి కారణం?
జ.. అందాలరాముడు తర్వాత దాదాపు అదే తరహా కథలు నా వద్దకు వచ్చాయి. దీంతో ఇక హీరోగా చేయకూడదని నిర్ణయించుకున్నాను. చాలా గ్యాప్ తర్వాత రాజమౌళి కథ చెప్పడం, దానికోసం కాస్త లావు తగ్గాలని సూచించడంతో పాత్రపరంగా ఔచిత్యాన్ని తెలిసి వెంటనే అంగీకరించాను.

ప్రశ్న.. సినీ రంగంలో మీ గోల్ ఏమిటి?
జ.. అనుకున్నవి జరగవు. వచ్చిన పాత్రల్ని స్వీకరించి మలుచుకోవడమే నా గోల్. నాకంటూ ఏవిధమైన గోల్స్‌లేవు. ఇప్పటివరకు ఒకే తరహాలో చేశానని అందరూ అంటుంటారు. దాన్నుంచి బయటపడాలనే రాజమౌళి కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రంలో నటిస్తున్నాను.

ప్రశ్న.. మర్యాద రామన్న ఏం చేస్తుంటాడు?
జ.. రాయలసీమలోని ఓ పల్లెటూరి ఉంటాడు. వ్యవసాయం చేసే కుటుంబం నుంచి ఓ పనిమీద సిటీకి వస్తాడు. ఆ నేపథ్యంలో సాగే కథ ఇది.

ప్రశ్న.. ఇప్పటి హీరోల్లో మీకు పోటీ ఎవరని భావిస్తున్నారు?
జ.. (నవ్వుతూ..) ఇండస్ట్రీలోని అందరూ హీరోలు పోటీనే.
About Writer
SELVI.M