1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. Evaraina Epudaina

Marthand Shankar| Evaraina Epudaina| AVM| Varun Sandesh| Vimala Raman | నాన్న ఫోటోముందు అడ్వాన్స్ ఇచ్చారు: మార్తాండ్ శంకర్

నాన్న
WD
"మార్తాండ్‌" అనేపేరు వినగానే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎడిటర్‌ గుర్తుకువస్తారు. ఆయన వారసులుగా మార్తాండ్‌ కె. వెంకటేష్‌ అయితే.. ఆయన సోదరుడు మార్తాండ్‌ శంకర్‌ దర్శకుడిగా అవతారమెత్తారు.

తొలిసారిగా ఆయనకు ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలో దర్శకుడిగా అవకాశం రావడం ఊహించని పరిణామమని అంటున్నారు. వరుణ్‌సందేశ్‌, విమలారామన్‌ జంటగా 'ఎవరైనా ఎప్పుడైనా' (ప్రేమలో పడొచ్చు) అనే చిత్రానికి మార్తాండ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...

ప్రశ్న.. మీ నేపథ్యం?
జ.. పుట్టింది హైదరాబాద్‌లో.. పెరిగింది చెన్నైలో. తండ్రి మార్తాండ్‌ సీనియర్‌ ఎడిటర్‌. పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. బి.ఎ.వరకు చదివాను. ఆ తర్వాత సినిమా ఫీల్డుకు వస్తే నాన్నగారే వద్దన్నారు. ఎందుకంటే నాకు తెలుగు సరిగ్గారాదు. ఎక్కడైనా అసిస్టెంట్‌గా చేరాలంటే తెలుగు రావాలి. అయితే తమిళం బాగా వచ్చు. ఆ తర్వాత కంప్యూటర్‌ కోర్సులో జాయిన్‌ అయ్యాను.

ప్రశ్న.. మరి దర్శకునిగా ఎలా మారారు?
జ.. నాలో ఉన్న తృష్ణను నా స్నేహితులకు చెప్పాను. ఓసారి నాన్నగారి కోసం ప్రసాద్‌ అనే వ్యక్తి వచ్చారు. ఆయన నా గురించి తెలుసుకుని అప్పుడే పలు యాడ్స్‌ చేస్తున్న జయంత్‌‌తో పరిచయం చేశారు. ఆయన దగ్గర 'సంతూర్‌ టాప్‌-10' యాడ్స్‌తో పాటు పలు యాడ్స్‌కు పనిచేశాను. ఆ తర్వాత ఆయనకు 'ప్రేమించుకుందాం రా' సినిమా చేసే అవకాశం రావడంతో నేను కూడా సినిమాలపై దృష్టిపెట్టాను.

ప్రశ్న... ఎడిటర్‌ ఫ్యామిలీ నుంచి దర్శకుడిగా ఎలా మారారు?
జ.. అది నా కోరిక. ఎడిటింగ్‌లోనే దర్శకునిగా అవగాహన ఉంది. ఇంతకుముందు అన్నయ్య వెంకటేష్ సినిమాలను పరిశీలించేవాడిని. ఇలా నాలో దర్శకుడు అవ్వాలనే కోరిక కలిగింది. ఆ తర్వాత టక్కరిదొంగ వరకు జయంత్‌ దగ్గర పనిచేశాను.

ప్రశ్న.. ఎక్కడైనా ఎప్పుడైనా నేపథ్యం ఏమిటి?
జ.. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు. ఈ సబ్జెక్ట్ పుట్టకానికి మా అమ్మగారు కారణం. ఓసారి ఆమెకు ఎపిడిడైమిస్ వస్తే ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. నేను ఒక్కడినే ఆమె దగ్గర ఉన్నాను. అక్కడ ఎప్పుడు బయటపడతామా అనిపించేంది. చివరిగా డిస్‌ఛార్జ్‌ అయిన రోజు జరిగిన ఓ సంఘటన నన్ను ఎంతో ఇన్‌స్పైర్‌ చేసింది. ఆ పాయింట్‌ను రాసుకుని కథగా మలిచాను. అంతే.. ఆసుపత్రిలో జరిగిన కథే ఇది కూడా.

ప్రశ్న.. ఎవిఎం. వంటి సంస్థలో పనిచేయడం ఎలా అనిపించింది?
జ.. మొదట నేనే నమ్మలేకపోయాను. పుల్లారావు అనే స్నేహితుడు నన్ను శరవణన్‌కు పరిచయం చేశారు. అప్పటికే నేను 4 కథలు రెడీ చేసుకున్నాను. అందులో ఒకటి వరుణ్‌సందేశ్‌ బేస్‌ చేసుకుని రాసుకున్నాను. ఇంతలో హ్యాపీడీస్‌ రిలీజ్‌ అయింది. కానీ ఆయన ఆ సినిమా చూడలేదు.

నేను కథ చెప్పగానే.. సందేశ్‌ను పిలిపించమన్నారు. చూశాక కథ చెప్పాను. ఫస్టాప్‌ చెప్పాక... కాసేపు లోపలికి వెళ్ళి.. వచ్చి.. ఈ కథను మీరే చేస్తున్నారని చెప్పి... ఆఫీసులో ఉన్న ఆయన తండ్రిగారైన మెయ్యప్పన్‌ ఫొటో ముందు నాకు, వరుణ్‌సందేశ్‌కు అడ్వాన్‌ ఇచ్చారు. అది వారి ఆనవాయితీ అట.

ప్రశ్న.. ఇందులో కాన్సెప్ట్‌ ఏమిటి?
జ.. నాకు పూరీ జగన్నాథ్‌, కరుణాకరన్‌ అంటే ఇష్టం. వారి చిత్రాలైన తొలిప్రేమ, ఇడియిట్‌ బేస్‌ చేసుకుని కథను తయారుచేశాను. ఈ రెండు కలిపితే ఎలా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా అలా ఉంటుంది. మంచి ఎంటర్‌టైనర్‌.

ప్రశ్న.. విమలారామన్ ఎంపిక ఎలా జరిగింది?
జ.. ఆమె ఆల్‌రెడీ మలయాళంలో సినిమాలు చేసింది. బాలచందర్‌ చిత్రం "పొయ్‌" చిత్రంలో చేసింది. చిథ్ర కథను అనుగుణంగా ఆమె సరిపోయింది. చిత్ర యూనిట్‌ కూడా ఆమెను మెచ్చుకున్నారు.

ప్రశ్న.. ఈ చిత్రం హైలైట్‌ ఏమిటి?
జ.. క్లైమాక్స్‌లో రెండు రీల్స్‌ అద్భుతంగా వచ్చాయి. అలాగే రమాప్రభ, హీరో, వేణుమాధవ్‌, హీరోయిన్‌ సీన్స్‌ చిత్రానికి ఆయువుపట్టు.

ప్రశ్న.. ఈ బేనర్‌లో చేయడం ఎలా అనిపిస్తుంది?
జ.. కథ తెలుగులో చెబుతాను అంటే తమిళంలో చెప్పమని ఎం.ఎస్‌. గుహన్‌ అడిగారు. 10 నిముషాలు గ్యాప్‌ తీసుకుని తమిళంలో కథ చెప్పాను. ఆయన సహజంగా నవ్వారట. నా కథ విని చాలా ఎంజాయ్ చేశారు. వారి బేనర్‌లో 172 సినిమా అని స్టూడియోలో ఫొటోకూడా పెట్టుకున్నారు. ఇదిచాలు... అంటూ ముగించారు.
About Writer
SELVI.M