గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » కష్టాల్ని ఇష్టంగా చేశాను: రియల్ స్టార్ శ్రీహరి (Srihari| Real Star| Interview| Magadheera| Dhee| August 15| Birth Day)
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
Sri Hari
WD
"బ్రహ్మనాయుడు" చిత్రంలో సినీ కెరీర్‌ను ప్రారంభించి తాజ్‌మహల్‌ చిత్రంతో ఆర్టిస్టుగా నిరూపించుకుని విలన్‌ నుంచి హీరోగా మారిన నటుడు శ్రీహరి.

ఫైటింగ్స్‌ను డూప్‌లేకుండా చేసి రియల్‌స్టార్‌గా ఎదిగాడు. అందరిచేత మనవాడుగా అనిపించుకున్న రియల్ స్టార్‌కు ఈ నెల ఆగస్టు 15 (స్వాతంత్రదినోత్సవం నాడు) పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీహరితో ముచ్చటించిన విశేషాలు మీకోసం.

ప్రశ్న: మీ పుట్టినరోజునాడు మీకేమి గుర్తుకువస్తుంది?
జ: మనకు స్వాతంత్య్రం వచ్చిననాడే నేను పుట్టడం గర్వంగా ఫీలవుతున్నాను. అదే నాకు తీపిగుర్తుగా ఉంటుంది. అందుకే ఈసారి నా పుట్టినరోజును సామాజిక సేవ చేయాలని నిర్ణయించుకున్నా. మా బాబు జ్ఞాపకార్థం... లక్ష్మాపూర్‌, అనంతారం, నారాయణపూర్‌ నల్లగొండ జిల్లాలోని మూడు గ్రామాలను దత్తత తీసుకున్నాను.

అక్కడ ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉంది. రెండు వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. అదేవిధంగా రెండువేలమంది విద్యార్థులకు భోజనానికి కావాల్సిన వంటసామాగ్రి ఏర్పాటుచేశాం.

ప్రశ్న: ప్రస్తుతం మగధీర సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
జ: చాలా సంతోషంగా ఉంది. అందులో షేర్‌ఖాన్‌ పాత్రను నా బర్త్‌డేగిఫ్ట్‌గా భావిస్తున్నాను. ఆ పాత్రకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రాజమౌళి నన్నే చేయమనడంతో పాత్రకూడా నచ్చడంతో చేశాను. అందరూ ఫోన్లుచేసి అభినందిస్తుంటే చాలా గొప్పగా చేశానా? అని నాకే డౌట్‌ వస్తుంది.

ప్రశ్న: హీరోగా బిజీ అయి ప్రత్యేక పాత్రలు చేయడానికి కారణం?
జ: కేవలం కథ, క్యారెక్టర్‌ ఈ రెండూ నచ్చడమే. కథ బాగుండి, ఆ పాత్రకు నేను న్యాయం చేయగలననిపిస్తే తప్పకుండా రెడీగా ఉంటా. అలా చేసినవే "నువ్వొస్తానంటే నే నొద్దంటానా" నుంచి "మగధీర" వరకు. ఆ పాత్రల్నే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

ప్రశ్న: హీరోగా, ప్రత్యేకపాత్రలు వీటిలో దేనికీ ప్రజలు రెస్పాన్స్‌ అవుతున్నారు?
జ: దేని స్పందన దానిదే. ఒకరకంగా చెప్పాలంటే ప్రత్యేక పాత్రలు చేయడం వల్లనే మంచి పేరు కెరీర్‌ ఉంది. తద్వారా కొత్త ఫ్యాన్స్‌ వస్తున్నారు. కొత్తదనంతోకూడిన పలు వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం కలుగుతుంది.

"ఢీ" చిత్రాన్ని చూసిన చాలామంది ఇప్పటికీ దాన్ని గుర్తుచేసుకుంటూ నన్ను ఎక్కడికి వెళ్ళినా పలుకరిస్తున్నారంటే ఆ పాత్రలో నన్ను చూడ్డమే కదా.?
Sri Hari
WD


ప్రశ్న: 23 ఏళ్ళ కెరీర్‌ను విశ్లేషించుకుంటే ఎలా అనిపిస్తుంది?
జ: ఇండస్ట్రీకి రాకముందు మా ఇంటి చుట్టుపక్కల వాల్‌పోస్టర్లలో హీరోను చూసి నేను కూడా హీరో అయితే బాగుండు అని కలలు కనేవాడిని. దాన్ని సాకారం చేసుకునే దిశగా ఇక్కడకు రావడం జరిగింది.

"ఎస్‌ బాస్..‌" అనే చిన్న పాత్రలనుంచి హీరోస్థాయికి ఎదిగాను. పరిశ్రమలో ప్రతి ఒక్కరూ శ్రీహరి మనవాడు, మనసున్న మంచివాడు అనిపించుకుంటూ నేనీరోజు ఉన్నానంటే నిజంగా అదృష్టమే.

సినిమాను ప్రాణంతో సమానంగా ప్రేమించాను. వేషాలకోసం ఎన్నో కష్టాలుపడ్డాను. అవన్నీ ఇష్టాలుగా చేసినవే.

ప్రశ్న: ఇంకా చేయాల్సిన డ్రీమ్‌ రోల్స్‌ ఉన్నాయా?
జ: అంజనీపుత్రుడు లాంటి పాత్రను ఎప్పటికైనా చేయాలాని డ్రీమ్‌. జలియన్‌ వాలాబాగ్‌లో జనరల్‌ డయ్యర్‌ అనే బ్రిటిష్‌ జనరల్‌ దాదాపు 3వేల మందిని నిర్దాక్షణ్యంగా కాల్చి చంపగా అందులో ముగ్ధ సింగ్‌ అనే అతను మాత్రమే బతుకుతాడు.

అతనికి ప్రతిక్షణం ఆ జనరల్‌ డయ్యర్‌ గర్తుకురావడం చివరికు అతను లండన్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళి వీరోచితంగా పోరాడి చనిపోతాడు. అటువంటి కథాంశంతో పవర్‌ఫుల్‌తో కూడిన క్యారెక్టర్‌ చేయాలనుంది. ఈ కథను హ్యాండిల్‌ చేసే దర్శకుడు దొరికతే తప్పకుండా నా బ్యానర్‌లో చేస్తా.

ప్రశ్న: కొత్త చిత్రాలు..?
జ: తమిళంలో ఎ.వి.ఎం. సంస్థ విజయ్‌తో నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నా. మిగిలినవి చర్చల్లో ఉన్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శ్రీహరి, రియల్ స్టార్, ఇంటర్వ్యూ, మగధీర, ఢీ, ఆగస్టు 15, పుట్టినరోజు