Mahesh Babu | Actor | Interview | I-max | ఆ డ్రింక్ నేనూ తాగుతాను.. అందులో తప్పులేదు: మహేశ్
WD
ప్ర. మీరు అభిమానులకు దూరంగా ఉంటున్నారెందుకు?
జ. అదేమీ లేదు. నేను ఇంకా వారికి దగ్గరవడానికి థమ్స్‌అప్ దోహదపడింది. అభిమానుల ఇంటింటికి తిరిగి కలిసే సౌకర్యం కల్పించింది థమ్స్‌అప్.
ప్ర. మరి సినిమా సినిమాకు గ్యాప్ రావడానకి కారణం..?
జ. పెద్ద కారణమేమీ లేదు. యాడ్స్‌లో పాల్గొనడం వల్ల ఈసారి ఆరేడు నెలలు గ్యాప్ తీసుకున్నా. ఇకపై అలా తీసుకోను.
ప్ర. థమ్స్‌అప్ డ్రింక్ తాగమని చెప్పడం సమంజసమేనా...?
జ. ఎందుకు కాదు. 24 గంటలూ తాగమని చెప్పడం లేదు. అప్పుడప్పుడు తాగవచ్చు. నేనూ తాగుతాను. అందులో ఎటువంటి దష్పలితాలు లేవని నా అభిప్రాయం.
ప్ర. మహేశ్ బాబంటే అభిమానులకు క్రేజీ ఎందుకు..?
జ. ఏమో.. నేను అందంగా ఉంటానని అందరూ అంటారు. అందుకనేనేమో...
ప్ర. కాస్త తగ్గినట్లున్నారు. 6 ప్యాక్ చేస్తున్నారా...?
జ. సిక్స్ ప్యాక్‌లు, 8 ప్యాక్‌లు చేయడం లేదు. స్లిమ్‌గా ఉండటానికి తగ్గాను.
ప్ర. మీకు నచ్చిన హీరోయిన్..?
జ. శ్రీదేవి
ప్ర. ఇప్పటి యంగ్ హీరోల్లో ఎవరంటే ఇష్టపడతారు..?
జ. మహేశ్ బాబు అంటే నాకు చాలా చాలా ఇష్టం.
ప్ర. మల్టీస్టారర్ చిత్రాల్లో నటించే అవకాశం ఉందా..?
జ. మల్టీస్టారర్ అంటేనే కథలు దొరకడం కష్టం. అందరికీ నచ్చిన కథలుంటే చేయడానికి నేను వెనుకాడను.
