గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » "మగధీర"లాంటి గుర్తుండిపోయే సినిమాలు చేయాలి: రవీందర్ (Ravinder| Interview| Magadheera| Art Director| Rakhi| Ashta Chemma| Vikramarkudu)
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
Ravinder, RajaMouli
WD
కళా దర్శకుడికి ఊహాశక్తి చాలా అవసరం. నిబద్ధత, అభిరుచి దానికి తోడైతే అద్భుతమైన దృశ్యాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చు. కొత్తగా ఏది చేసినా దాంతో ప్రేక్షకుడిని మెప్పించగలం.

మయసభలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించడం కూడా కళే. ఆనాడు అంతగా కళాదర్శకుల పనితీరు ఉండేది. నేడు మగధీరకు అటువంటి తరహాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని కళాదర్శకుడు రవీందర్ చెబుతున్నారు.

ప్రశ్న: ఉత్తమ కళాదర్శకుడిగా ఎదగాలంటే ఏం కావాలి?
జ: చాలామంచి ఊహాశక్తి కావాలి. దీనికి అభిరుచి తోడైతే ఆ అద్భుత కళాదృశ్యాలను ప్రేక్షకులు చూడగలరు. కొత్తగా ఏదైనా చేసి ప్రేక్షకుడిని మెప్పించేలా ఉండాలి. సెట్‌వేస్తేనే కళాదర్శకుడు కాదు. సన్నివేశానికి తగినట్లు పరిసరాలను సిద్ధం చేయాలి. ఆ విషయం ప్రేక్షకుడికి తెలియకూడదు. మధ్యతరగతి ఇల్లు ఉంటే బుల్లిటీవీ ఉండాలే తప్ప పెద్దటీవీ ఉండకూడదు. ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రశ్న: మీ నేపథ్యం?
జ: నెల్లూరు జిల్లా. ఢిల్లీలో ఐఐటిలో ఎం.డి.ఇ.ఎస్. పూర్తిచేశాను. ముందుగా గుణ్ణం గంగరాజు నిర్మించిన "అమృతం" సీరియల్‌కు పనిచేశాను. తర్వాత "ఐతే" సినిమాకు చేశాను. రాఖీ, అష్టాచమ్మా, ఒక్కడున్నాడు, విక్రమార్కుడు, ఛత్రపతి చిత్రాలకు పనిచేశాను. ఇవన్నీ ఒక ఎత్తయితే మగధీర మరో ఎత్తు.

ప్రశ్న: భారీ స్థాయిలో సెట్ వేస్తే సినిమా సక్సెస్ అవుతుందా?
జ: ఏదైనా సరే కథలో భాగంగానే సెట్ ఉండాలి. దానికి మించి ఎంత చేసినా అది వృధా అవుతుంది. కథను మరిచి సెట్‌వేస్తే అవి చిత్ర విజయానికి ఎంత మాత్రం దోహదపడవు.

ప్రశ్న: మరి మగధీరలో మీరు వేసిన కాళభైరవుని విగ్రహం పునర్జన్మలోనూ చెక్కుచెదరకుండా ఉందనే విమర్శ ఉంది?
జ: అవును. చాలామంది అన్నారు. కానీ ఆ విగ్రహం కాలపరిస్థితుల రీత్యా కప్పబడి ఉంది. దుమ్ము, ధూళి అనేవి తక్కువ ఉన్న వాతావరణం అది. కనుక ఎక్కువగా చెడిపోదు. ఆ విషయమే ఓ సన్నివేశంలో చెబుతారు. కానీ ఆ సన్నివేశాన్ని కొన్ని కారణాలవల్ల లెంగ్త్ ఎక్కువైందని తీసేశారు. ఏది ఏమైనా ఆ సెట్‌కు అనూహ్యస్పందన వచ్చింది.

ప్రశ్న: మీకు ఆదర్శకులు ఎవరు?
జ: తోట తరణి. ఒక విధంగా ఆయనకు నేను ఏకలవ్యశిష్యుడ్ని.

ప్రశ్న: మగధీరతో హాలీవుడ్ చిత్రం ఆఫర్ కొట్టారని తెలిసింది?
జ: 1983 భోపాల్ ఘటన ఆధారంగా "ఏ ప్రేయర్ ఫర్ రైన్" అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు కూడా నేను చేపట్టాను. దీనికోసం బొల్లారంలో సెట్‌వేశాను.

ప్రశ్న: మీ తదుపరి చిత్రాలు?
జ: ఆర్య-2 చేస్తున్నారు. తర్వాత చంద్రశేఖర ఏలేటి చిత్రం. దాని తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే "మర్యాద రామన్న".

ప్రశ్న: మీ లక్ష్యం?
జ: ఎన్ని చేశామనేదికాదు. 'మగధీర'లాంటి గుర్తిండిపోయే చిత్రాలు ఎన్ని చేశామనేదే నాకు ముఖ్యం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: రవీందర్, ఇంటర్వ్యూ, మగధీర, కళాదర్శకుడు, రాఖీ, అష్టాచమ్మా, విక్రమార్కుడు, ఛత్రపతి