గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » "అన్నయ్య" చేసిన హితోపదేశం మరువలేనిది: శ్రీకాంత్ (Srikanth, Interview, Chiranjeevi, NTR, Ooha, Love, Mahatma, Cinema, Villain, Character Artist)
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
Srikanth
FILE
ఉషాకిరణ్‌మూవీస్ "పీపుల్స్ ఎన్‌కౌంటర్" నుంచి అంచెలంచెలుగా ఎదిగిన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరో అయిన శ్రీకాంత్ "మహాత్మా"తో వంద చిత్రాలను పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ పలు విషయాలను వెల్లడించారు. అవి మీ కోసం..

ప్రశ్న: వంద సినిమాల కెరీర్‌ను ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?
జ: చిన్నపాత్రనుంచి విలన్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. మెల్లగా హీరోగా ఎదిగాను. మళ్లీ మరో హీరోతో కలిసి నటించాను. ఇలా ఒక్కో సినిమా ఒక్కో మజిలీ. నా సినీ కెరీర్‌లో చిరంజీవితో నటించేటప్పుడు పొందిన ఆనందం అంతా ఇంతాకాదు. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలు చూసేందుకు ఎగబడేవాడిని. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూసేవాడిని. అటువంటి నటుడితో కలిసి శంకర్‌దాదా జిందాబాద్ నటిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇకపోతే.. పూర్తిస్థాయి పౌరాణిక పాత్రలో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయింది. ఎన్టీఆర్ గారిని కృష్ణుడి పాత్రలో చూసి పెరిగిన వాడిని. "సుప్రభాతం"తో మీసాలు, గాగుల్స్ పెట్టి కామిక్‌గా ఓ పాటలో ఆ పాత్ర ట్రై చేశా. కానీ పూర్తిగా చేయాలనే కోరిక తీరలేదు.

ప్రశ్న: ఒకవేళ కోరిక తీరినా ప్రేక్షకులు ఆదరిస్తారా?
జ: అది కరెక్టే.. కానీ కథా బలం ఉన్నప్పుడు పాత్రలో నిమిత్తం లేకుండా పాత్రవరకే కన్పిస్తే తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకముంది. బహుశా ఇంకా పౌరాణికాలు చూసే టైమ్ రాలేదేమో. సామాజిక చిత్రాల్లో కొత్తదనం కోరుకునే సమయంలో పౌరాణికాలు తీస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.

ప్రశ్న: వ్యక్తిగత జీవితంలో ప్రేమ గురించి మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా?
జ: ఊహ విషయం తెలిసిందే. కానీ నేను ధార్వాడ్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఫస్ట్‌లవ్ అంటారు గదా. దానికి గురయ్యాను. కానీ ఆ లవ్ బయట పెట్టలేకపోయా. పెళ్లిచేసుకుంటే అలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకున్నా. కానీ అప్పటి పరిస్థితిరీత్యా భయంతో చెప్పలేదు. మొత్తానికి వన్‌సైడ్‌లవ్ అన్నమాట. ఆ తర్వాత ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది.

ప్రశ్న: అసలు సినిమాలో నటించే కోరిక ఎలా కలిగింది?
జ: చిన్నప్పుడే 8వ తరగతినుంచి సినిమాలు బాగా చూసేవాడిని. నేను కర్నాటకలో పెరిగాను. అక్కడ ఎన్టీఆర్ సినిమాలు బాగా ఆడేవి. ఆయన సీఎం అయ్యాక చిరంజీవిగారి సినిమాలు వచ్చేవి. ఖైదీకి ముందు నుంచే నేనుండే గంగావతి నుంచి బళ్ళారి వెళ్లి సినిమాలు చూసేవాడిని. అది ఎంతవరకు వెళ్ళిందంటే.. టెన్త్ పూర్తవ్వగానే చెన్నై పారిపోయాను.

జ్యోతిచిత్ర, సితార సినిమా వార్తలు చూసి ఫలానా చోట షూటింగ్ అని అక్కడి వెళ్ళేవాడిని. కానీ అక్కడ స్టూడియోలకు వెళితే రానిచ్చేవారు కాదు. కొన్నిరోజుల తర్వాత నాకు నేనే సర్దిచెప్పుకుని వెనక్కువచ్చాను. దాంతో ఏడాది వృధా అయింది. ఆ తర్వాత డిగ్రీపూర్తి చేసి మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరాను.

ఆ తర్వాత విజయవాడ లక్ష్మీఫిలింస్ మూర్తిగారు నన్ను ప్రోత్సహించారు. అలా కొంతమంది శ్రేయోభిలాషుల సహకారంతో ఉషాకిరణ్‌మూవీస్ వారు కొత్తవారిని పరిచయం చేస్తున్నారని తెలిసి ప్రయత్నిస్తే.. దర్శకుడు మోహన్‌గాంధీ ఓ డైలాగ్ చెప్పమన్నారు. ఆల్‌రెడీ ఫిలిమ్ ఇన్‌‌స్టిట్యూట్ అనుభవం చెప్పాను. దీంతో అందులో నగ్జలైట్ పాత్ర లభించింది.

ప్రశ్న: మీ కెరీర్‌లో ఫలానా దర్శకుల దగ్గర చేయలేదనే ఫీలింగ్ ఉందా?
జ: రాజమౌళి, పూరీ, వినాయక్‌లతో చేయగలనా? అనే సందేహం ఉంది. అయితే చేయగలను అనే నమ్మకమూ ఉంది.

ప్రశ్న: ఔటాఫ్ సినిమాగా మీరు గుర్తించుకునే సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
జ: ఎన్నో ఉన్నాయి. నేను ఇండస్ట్రీకి రాకముందు "రాష్"గా ఉండేవాడిని. కాలేజీలోనే ఓ హోటల్ యజమానిని కొట్టడానికి గ్యాంగ్ తీసుకుని వెళ్ళేవాడిని. ఓ ప్రేమ జంటకు యజమాని ఆశీస్సులు ఉండడమే కారణం. ఇదంతా స్నేహితుల కోసమే చేసేవాడిని. ఇక ఇండస్ట్రీకి వచ్చాక పూర్తిగా మారిపోయింది. 98లో నాకు వరుసగా 8 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఆ టైమ్‌లో స్నేహితులనుగానీ, కుటుంబసభ్యులనుకానీ కలిసేవాడిని కాదు. ఆ టైమ్‌లో చిరంజీవి నుంచి కాల్ వచ్చింది. అంతకుముందే ఆయనను కలిసేవాడిని. ఈ ఫ్లాప్ గ్యాప్‌లో చిరును కూడా కలవలేదు. "అంజి" సినిమా షూటింగ్ టైమ్‌లో ఆయన నన్ను అన్నపూర్ణ స్టూడియోలో చాలాసేపు యోగక్షేమాలు అడిగారు.

నేను డైలామాలో ఉంటే ఆయన తన జీవితంలో మేకప్‌లేకుండా ఏడాదిపాటు ఉన్న విషయాన్ని చెప్పారు. అజయం వస్తే కుంగిపోకూడదని హితోపదేశం చేశారు. అప్పటి నుంచి నాలోతెలీని ధైర్యం వచ్చింది. ఇది ప్రధానంగా నేను మర్చిపోలేని సంఘటన.

ప్రశ్న: జ్యోతిష్యం, జాతకాలు నమ్ముతారా?
జ: తప్పకుండా.. మూర్ఖంగా, మూఢంగా కాదు. శాస్త్రం అనేది ఉందని విశ్వసిస్తాను. అదీ పరిమితి మేరకే.

ప్రశ్న: మీ ఫ్యామిలీ గురించి చెబుతారా?
జ: నాకు ముగ్గురు పిల్లలు. నాకన్నా వాళ్ళమ్మతో బాగా సన్నిహితంగా ఉంటారు. అయితే పెద్దాడు రోషన్‌కు మాత్రం నేనంటే కొంచెం క్రేజీగా ఉంటాడు.

ప్రశ్న: తదుపరి చిత్రాల వివరాలు?
జ: మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తా.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శ్రీకాంత్, ఇంటర్వ్యూ, చిరంజీవి, ఎన్టీఆర్, ఊహ, ప్రేమ, మహాత్మా, సినిమా, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు