గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » 'పూరి జగన్నాథ్' నా డార్లింగ్: బిల్లా స్టార్ ప్రభాస్ (Prabhas Interview| Puri Jagannath| Darling| Ek Niranjan| Billa| Varsham| Eswar)
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
Prabhas
WD
"ఈశ్వర్"తో హీరోగా పరిచయం అయి రాఘవేంద్ర, వర్షం, ఛత్రపతి, చక్రం, అడవిరాముడు, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో "ఏక్‌నిరంజన్"గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌లో కరుణాకరన్ దర్శకత్వంలో, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తోన్న భారీ చిత్రం షూటింగ్‌లో ఉన్న బిల్లాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం...

ప్రశ్న: లాస్ట్ బర్త్‌డేకి, ఈ బర్త్‌డేకి మధ్య మీ కెరీర్ ఎలా వుంది?
జ: లాస్ట్ బర్త్‌డేకి "బిల్లా" సినిమా ప్రారంభమైంది. ఈ పుట్టిన రోజుకి కరుణాకరన్ దర్శకత్వంలో, ఛత్రపతి ప్రసాద్ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. ఈ మధ్యలో 'బిల్లా' రిలీజ్ అయి మంచి సక్సెస్ అందించడం హ్యాపీగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత గోపికృష్ణ పతాకంపై తీసిన 'బిల్లా' మంచి హిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ బర్త్‌డే గిఫ్ట్‌గా పూరీ జగన్నాథ్ "ఏక్‌నిరంజన్" రిలీజ్ అవుతోంది.

ప్రశ్న: "ఏక్‌నిరంజన్"లో మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన పాయింట్?
జ: హీరో క్యారెక్టర్ ఇంతకుముందు ఏ సినిమాలో చూడని తరహాలో ఉంటుంది. ఇలాంటి పాత్ర మన భారతీయ సినిమాల్లో భాగంగా ఏక్‌నిరంజన్‌లో చూపించడం తొలిసారి. పైకి రఫ్‌గా కనిపించే ఈ క్యారెక్టర్‌లో అండర్ కరెంట్ ఓ ఫీల్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చేసింది. నాకు ఆర్టిస్టుగా మంచి తృప్తి కలిగించిన పాత్ర అది.

ప్రశ్న: పూరి జగన్నాథ్‌తో "బుజ్జిగాడు" తర్వాత చేసిన సినిమా ఇది. ఎలా ఫీల్ అయ్యారు?
జ: పూరిగారు నా డార్లింగ్. ఆయనతో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీ. మళ్ళీ సినిమా చేద్దామని ఆయన అంటే.. వెంట వెంటనే చేయడానికి నేను రెడీ. మా కాంబినేషన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలుంటాయి. "ఏక్‌నిరంజన్" ఆ అంచనాలను అధిగమిస్తుంది. తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది.

ప్రశ్న: ఏక్‌నిరంజన్ మ్యూజిక్ గురించి?
జ: మణిశర్మ "బిల్లా"లో బొమ్మాలీ పాటను సూపర్‌హిచ్ చేశారు. "ఏక్‌నిరంజన్‌"లో అన్ని పాటలు బాగా చేశారు. ముఖ్యంగా "ఏక్‌నిరంజన్" టైటిల్ సాంగ్ నా కెరీర్‌లో బెస్ట్ సాంగ్ అవుతుంది. 'వర్షం' తర్వాత నాకు మళ్ళీ మంచి మ్యూజికల్ హిట్‌గా 'ఏక్‌నిరంజన్' నిలబడుతుంది.

ప్రశ్న: "ఏక్‌నిరంజన్"లో యాక్షన్ పార్ట్ ఎలా ఉంటుంది?
జ: రగ్‌డ్‌గా ఉంటుంది. స్టన్ శివ యాక్షన్ చాలా బాగా తీశారు. ప్రతి సీన్‌లోనూ ఏదో ఒక యాక్షన్ ఉంటుంది. ఈ కథ కూడా అలాంటిదే. ముఖ్యంగా 'ఏక్‌నిరంజన్' క్లైమాక్స్ సినిమాకు హైలైట్.

ప్రశ్న: ఆదిత్యారామ్ పతాకంపై తొలి చేశారు కదా? ఆ అనుభవం ఎలా ఉంది?
జ: ఆదిత్యారామ్ మంచి టేస్ట్ వున్న నిర్మాత. చాలా లావిష్‌గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా "ఏక్‌నిరంజన్" తీశారు. ఈ బ్యానర్‌పై చేయడం చాలా హ్యాపీ. 'ఏక్‌నిరంజన్' ప్రమోషన్ కూడా అలాగే భారీగా చేస్తారని ఆశిస్తున్నాను.

ప్రశ్న: ఈ పుట్టినరోజును ఎలా గడుపుకోవాలనుకుంటున్నారు?
జ: స్విట్జర్లాండ్‌లో యూనిట్ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అభిమానులకు దూరంగా ఉండటం బాధగా ఉన్నా తప్పలేదు. షెడ్యూల్స్ అలా వచ్చాయి.

ప్రశ్న: బర్త్‌డే సందర్భంగా మీ అభిమానులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
జ: నా కెరీర్ అభివృద్ధికి అభిమానులో ఎన్నో మంచి సలహాలు ఇస్తున్నారు. నా సక్సెస్‌ని నాకంటే వాళ్లే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటాను. అభిమానులు మెచ్చే చిత్రాలు చేయాలన్నదే నా లక్ష్యం. నా బర్త్‌డే సందర్భంగా నన్ను ఎంతగానో ఆదరిస్తున్న అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ప్రశ్న: మీ తదుపరి చిత్రాల గురించి?
జ: కరుణాకర్ దర్శకత్వంలో, ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్, అరకులో ఓ షెడ్యూల్ ఉంటుంది. వేసవికానుకగా ఈ చిత్రం విడుదలవుతుంది. ఓ నెలరోజుల్లో దిల్‌రాజు, దశరథ దర్శకత్వంలో నిర్మించే మరో చిత్రం ఆరంభమవుతుంది. ఈ రెండూ లవ్, ఫ్యామిలీ, యాక్షన్ అంశాలున్నవి. ఈ సినిమాల తర్వాత రాఘవేంద్రరావు నిర్మాతగా, రాజమౌళి దర్శకత్వంలో మూడో సినిమా చేస్తాను.

ప్రశ్న: ఏక్‌నిరంజన్ హైలైట్స్ ఏమిటి?
జ: హీరో క్యారక్టరైజేషన్, పూరి డైలాగ్స్, మ్యూజిక్, యాక్షన్.. ఇలా అన్ని హైలైట్సే. మొత్తంగా చెప్పాలంటే.. పూరి అందించే మంచి కమర్షియల్ ప్యాకేజి "ఏక్‌నిరంజన్" అంటూ ముగించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ప్రభాస్, ఇంటర్వ్యూ, పూరి జగన్నాథ్, డార్లింగ్, ఏక్ నిరంజన్, బిల్లా, వర్షం, ఈశ్వర్