గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » నాకు అలాంటి ఉద్దేశమే లేదు. నన్ను వివాదాల్లోకి లాగకండి..! (Ileana| Interview| Devdas| Salim| Vishnuvardhan| Glamour| Politics| Campaign)
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
Ileana
WD
"దేవదాసు" చిత్రంతోనే తెలుగువారిని ఉర్రూతలూగించిన అందాల ముద్దుగుమ్మ ఇలియానా... తెలుగు సినిమాలే చేస్తానని నొక్కి చెబుతోంది. తాజాగా ఆమె మంచు విష్ణువర్ధన్‌బాబుతో, వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో "సలీం"లో కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే సుపారియా, సోప్స్, షాంపూలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న ఇలియానా గురువారం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..

ప్రశ్న: మీ గ్లామర్ రహస్యం సుపారియానా?
జ: నవ్వుతూ.. సుపారియా సబ్బులో మందార, బ్రాహ్మి వనమూలికలుంటాయి. వాటిని వాడి చూశాను. షాంపూలో బాదం, చందనం కలిపి ఉంటుంది.

ప్రశ్న: ఎప్పటి నుంచి వాడేవారు?
జ: ఈ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పటినుంచి.. దాదాపు అక్టోబర్ 15 నుంచి..

ప్రశ్న: ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ప్రచారానికి వెళ్తారా?
జ: రాజకీయాల గురించి నాకు తెలియదు. నన్ను ఎవరూ పిలవరు. పిలిచినా వెళ్ళను.

ప్రశ్న: పోనీ ఏదైనా పార్టీకి అంబాసిడర్‌గా ఉంటారా?
జ: నన్ను వివాదాల్లోకి లాగకండి.. నాకు అలాంటి ఉద్దేశ్యమేలేదు.

ప్రశ్న: మీపై వచ్చే రూమర్స్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారు?
జ: దేవదాసు తొలి సినిమా చేశాక.. చాలా చోట్ల నా గురించి బాగానే రాశాను. ఆ తర్వాత నా గురించి గాసిప్స్ మొదలయ్యాయి. నాకు తెలియకుండా నాలో మరో కోణం ఉందంటూ ఏవేవో రాసేశారు. అప్పుడు ఏడుపు వచ్చింది. స్నేహితులు ఇచ్చిన సలహాతో.. ఇవన్నీ గ్లామర్ ఫీల్డులో మామూలే అని పెద్దగా పట్టించుకోవడం లేదు.

ప్రశ్న: మీరు ఫలానా హీరోతో చేస్తానని ఎప్పుడైనా అడిగారా?
జ: ఇది పురుష సామ్రాజ్యం. ఇండస్ట్రీ మేల్ డామినేషన్. అలాంటి చోట నేను ఫలానా హీరోతో చేస్తానని అనను. అనలేను. నాకు ఆ ఉద్దేశ్యంలేదు. కథ బాగుంటే ఎవరితోనైనా నటిస్తాను.

ప్రశ్న: హిందీ చిత్రాల్లో నటించే ఆలోచనలేదా?
జ: హిందీకంటే తెలుగువారు నన్ను బాగా ఆదరించారు. వారంటేనే ఇష్టం. మంచి కథలు ఇక్కడే వస్తున్నాయి.

ప్రశ్న: మరి తెలుగులో ఎప్పుడు మాట్లాడుతారు?
జ: చాలారోజుల నుంచి ప్రయత్నిస్తున్నా. నాను నేను డబ్బింగ్ చెప్పుకోవాలని. కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు వేగంగా జరగడం, షూటింగ్‌లో పాల్గొనడం వల్ల సాధ్యపడలేదు. భవిష్యత్‌లో డబ్బింగ్ చెబుతాననే నమ్మకముంది. అయితే తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకోగలను.

ప్రశ్న: మీ బాడీని నాజూగ్గా ఉంచుతున్నారా? మరి జీరోసైజా?
జ: అదేం లేదు. నేను అలాంటివి పట్టించుకోను. తినేది పరిమితం.

ప్రశ్న: ఆర్టిస్టుగా మీరు చేయలేని పాత్ర ఏమైనా ఉందా?
జ: మేకప్‌లేకుండా.. విలేజ్‌ అమ్మాయిగా నటించాలనుంది.

ప్రశ్న: మీలో ఉన్న మైనస్సులు?
జ: నేను హాట్‌టెంపర్‌ను. నాలో ఉన్న మైనస్ అదే. నన్ను ఎంతమంది విమర్శించినా అందులో నిజం లేకపోతే.. చీల్చి చెండాలనేంతగా ఆవేశం వస్తుంది.

ప్రశ్న: హీరోయిన్లకు గుడి కట్టించేవిధానం ఉంది కదా? మీకు ఎవరైనా గుడి కడితే..?
జ: నేను దేవతను కాను. సామాన్య మనిషిని. అలాంటివాటికి నేను వ్యతిరేకం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఇలియానా, ఇంటర్వ్యూ, దేవదాసు, పోకిరి, విష్ణువర్ధన్, సలీం, గ్లామర్, రాజకీయాలు