Geetanjali | E maya chesave | Cinema | Naga Chaitanya | Hero | Telugu | "గీతాంజలి" ఫీల్‌ను కలిగించే "ఏ మాయ చేసావే": నాగచైతన్య
వెండితెరపై అక్కినేని వారసుడు నాగచైతన్య. సినిమాపై ఉన్న మక్కువతో ఈ రంగంలోకి వచ్చినా తనకు దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవీ లేవని చెపుతున్నారు. స్టెప్ బై స్టెప్ ఎక్కాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. తాజాగా, ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో "ఏ మాయ చేసావే" చిత్రంలో నటించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ చైతన్యతో ఇంటర్వ్యూ...
* మళ్లీ ప్రేమ స్టోరీలో నటించడానికి కారణం?
లవ్ అనేది కామన్. ఎటువంటి చిత్రమైనా అందులో అంతర్లీనంగా ప్రేమ ఉంటుంది. అది లేకపోతే బోర్ కొడుతుంది. అందరికీ లవ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేకపోతే.. జీవితంలో కష్టం. ఈ చిత్రం చూశాక అందరికీ అలా అనిపిస్తుంది.
* కథ సినిమా నేపథ్యమా?
కొద్దిగా ఉంటుంది. నా పాత్ర పేరు కార్తీక్. ఇంజనీరింగ్ పూర్తయి అసిస్టెంట్ డైరక్టర్‌గా చేస్తుంటాడు. ఆ నేపథ్యంలో కేరళకు చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్‌సైట్‌లా ఉంటుంది. మంచి ఫీల్ గుడ్ కలిసిన కథ. "గీతాంజలి"లా ఫీల్ ఉంటుంది. ఇండస్ట్రీ నేపథ్యమనేది అస్సలు ఎక్కడా కనిపించదు. కొద్దిగా ఉంటుంది.
కామెడీ కూడా కావాల్సినంత ఉంది. కృష్ణుడు పాత్ర పూర్తి కామెడీ. నాతోపాటే సినిమా అంతా ఉంటాడు. హీరోగా చేసిన పాత్ర మేరకు ఆయనే న్యాయం చేస్తాడు. దానికి సమాధానం సినిమా చూస్తే తెలుస్తుంది.
* తెలుగు, తమిళంలో క్లైమాక్స్ మార్చడానికి కారణం?
ఈ సినిమాను తమిళంలో శింబు, త్రిష చేశారు. తమిళనేటివిటీకి అనుగుణంగా అక్కడ క్లైమాక్స్ వేరుగా ఉంటుంది. తెలుగులో మనకు తగినట్టుగా క్లైమాక్స్ ఉంటుంది.
* "జోష్" సినిమా అభిమానులకే నచ్చలేదని తెలిసింది?
నాన్న అభిమానులు సినిమా చూసి బాగా చేశావ్ అన్నారు. ఆ చిత్రం ముందు అనుకున్న అంచనాలకు అది చేరుకోలేకదు. ఇంట్లోవారు బంధువులు చూసి ఫెరఫార్మెన్స్ బాగుందన్నారు. "జోష్"లో ఎనర్జీ అనేది పాత్రమేరకే ఉంటుంది. ఆ సినిమా తర్వాత చాలా నేర్చుకున్నాను. సినిమా.. సినిమాకు నేర్చుకుంటూనే ఉంటాను. గోతమ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఒక్కో సినిమా ఒక్కో రకంగా చేయాలని నిర్ణయించుకున్నా.
* కామాక్షి బేనర్‌లో కొత్త దర్శకుడితో చేయడానికి కారణం?
నాకింకా తెలియలేదు. కామాక్షి బ్యానర్ పెద్దది. అందులో సీనియర్ దర్శకుడు ఉంటాడని అనుకుంటున్నా. ఇప్పటికే లొకేషన్ల కోసం విదేశాలకు వెళ్లారు. సో వెయిట్ అండ్ సీ.
