Super Cowboy | Raghava Larence | Director | Interview | కౌబాయ్ పాత్ర రావడం నా అదృష్టం: లారెన్స్
WD
అదే సమయంలో కౌబాయ్ చిత్రంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెపుతున్నారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్లో భాగంగా ఆయన హైదరాబాదు వచ్చారు. ఈ సందర్భంగా లారెన్స్ చెప్పిన సంగతులు మీకోసం.. తెల్లటి వస్త్రాలతో చాలా ప్రశాంతంగా కన్పించారు. మనిషి కాస్త తగ్గినట్లుగా కూడా ఉన్నారు.
మీలో చాలా మార్పు వచ్చిందే... చాలా కూల్‌గా ఉన్నారు...?
నిజమా.. ఇప్పటివరకూ ఆలోచించలేదు. నాలో ఏమార్పు రాలేదు. రాఘవేంద్రస్వామి గుడిలో బిజీగా ఉండటం వల్ల కొద్దిరోజులు మాల వేసాను. బహుశా... ఆ ప్రభావం ఉన్నదేమో నేనైతే ఆలోచించలేదు. నా సినిమాలకు గ్యాప్ కూడా అందుకే. గుడి కట్టడం నా చిరకాల కోరిక. అందుకే దానికి ప్రాధాన్యత ఇచ్చాను.
కౌబాయ్ రెండు భాషల్లో చేస్తున్నారా...?
తమిళంలో చేశాను. దాన్ని తెలుగులోకి డబ్ చేస్తున్నారు
ఈ తరుణంలో కౌబాయ్ సినిమాలు చేయడానికి కారణం..?
కౌబాయ్ చిత్రాలు ఎప్పుడైనా చూస్తారు. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది. పూర్తి ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు యాక్షన్ కూడా ఉంది. ఇందులో రెండు పాత్రలు పోషించాను.
కౌబాయ్ ఏం చేస్తుంటాడు...?
మొదటి పాత్ర సింగారం. వాడు ఏమీ చేయడు. జులాయి. అమ్మాయిలతో కాలం గడుపుతుంటాడు. పద్మప్రియ, లక్ష్మీరాయ్, సంధ్య కూడా వారికే కావాలి. రెండోవాడి పేరు సింహం. వీడు పనిచేయనివారంటే అసహ్యం. ఎవరైనా బాధపడుతుంటే ఆదుకుంటుంటాడు. ఓ కొండ ప్రాంతంలో ప్రజలను పీడించి దోపిడీ చేస్తున్న కొందరు రౌడీలను సింహం ఎలా కాపాడాడు అనేది కథ.
కౌబాయ్‌గా శిక్షణ తీసుకున్నారా...?
ఈ సినిమాలో ప్రత్యేకంగా హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. గన్ పట్టుకోవడం, క్యాప్ వెరైటీగా తిప్పడం ఇవన్నీ నేర్చుకున్నాను. నేనే కాదు.. నాతోపాటు సాయికుమార్, నాజర్ కూడా ఉదయం ఆరు గంటలకు చెన్నై బీచ్‌కు వెళ్లి నేర్చుకున్నాం.
కౌబాయ్ చిత్రాలు చూశారా..?
ఇంగ్లీషు, తెలుగులో కూడా చూశాను. కృష్ణగారి మోసగాళ్లకు మోసగాడు చూశాను. చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ చిత్రంలో కౌబాయ్‌గా కొన్ని సూచనలు పాటించాను.
సూపర్ కౌబాయ్ అని పేరు పెట్టడానికి కారణం...?
ఇందులో కౌబాయ్ మ్యూజిక్‌లు చేస్తుంటాడు. అవి పిల్లలకు బాగా నచ్చుతాయి. అందుకే సూపర్ కౌబాయ్ అని పేరు పెట్టాం.
ఈ కథను దర్శకుడు మీకే చెప్పడానికి గల కారణం..?
గన్ తిప్పడం, క్యాప్, హార్స్ రైడింగ్ వంటివాటిల్లో స్టైల్‌గా ఉంటాడని రజనీకాంత్ కోసం కథ అనుకున్నారు దర్శకుడు. కానీ ఆయన రోబో షూటింగ్‌లో మూడేళ్లపాటు ఉండాల్సి రావడంతో అతని కోడైరెక్టర్ నా పేరు సూచించారు. నేను కొన్ని సినిమాల్లో డాన్స్ చేస్తూ గన్స్ తిప్పడం, టోపీలు స్టైల్ గా పెట్టుకోవడం గమనించి ఈ కథ నాకు సరిపోతుందని ఆయన అనుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ సేలంలో అంబాసముద్రం, కడపలో గండి ప్రాంతాలలో తీశాం.
నాగార్జున మీతో నటిస్తానని చెప్పారు. ఎంతవరకు వచ్చింది...?
అది త్వరలో ఉంటుంది. నాగార్జునతోపాటు మరో రెండు స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి. అల్లు అర్జున్, ప్రభాస్‌కు సంబంధించిన కథలు ఉన్నాయి. అవి ఎప్పుడు అనేవి త్వరలో తెలియజేస్తాను
నిర్మాతగా చిత్రాన్ని చేస్తున్నానన్నారు. అది ఏమిటి...?
కౌబాయ్ ముందు కాంచన చేయడానికి ప్లాన్ చేసుకున్నాను. శింబుదేవన్ కౌబాయ్ కథ చెప్పారు. అది ఎంతగానో నచ్చింది. దాంతో అది కాస్త వెనక్కి వెళ్లింది. గతంలో ముని చేశాను. దానికి సీక్వెల్ కాంచన. ఇందులో అనుష్య ప్రధానపాత్ర పోషించనుంది. ఈ సినిమాకు నేనే నిర్మాతగా ఉంటాను. దర్శకత్వం కూడా వహిస్తాను. ఈ నెల 26న కౌబాయ్ విడుదలయ్యాక ఆ పనిపై ఉంటాను.
