Actress Vega | Interview | Bikini | Happy happyga | బికినీలు... మిడ్డీలు వేసుకుంటే సరిపోదు: వేగ
WD
మీ నేపథ్యం?
మాది ముంబై. నేను ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశా. నాన్నగారు ఇంజనీర్. అమ్మ కస్టమ్స్ ఆఫీసర్.
ఉన్నతకుటుంబానికి చెందిన మీరు ఈ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు..?
నాన్నగారు స్టేజీ ఆర్టిస్టు. నేను అప్పుడప్పుడు నాటకాలు వేసేదాన్ని. నాకు నటన కొత్తకాదు. కొన్ని వ్యాపార ప్రకటనల్లోకూడా చేశాను. ముంబై వచ్చినప్పుడు ఆ ప్రకటనచూసి వెంకట్ ప్రభు దర్శకుడు 'సరోజ'సినిమాలో అవకాశం కల్పించారు. తమిళంలో బాగా ఆడింది. తెలుగువారికి కూడా నేను పరిచయమే. సినిమాల్లో నటించడం తల్లిదండ్రులకు ఇష్టమే. వారు తెరపై చూసి ఆనందిస్తుంటారుకూడా.
మరి ముంబైలోనే ఎందుకు ట్రై చేయలేకపోయారు?
చేశాను. చిట్టగాంగ్ అనే సినిమాలో చేశా. అది 1930నాటి రియల్ స్టోరీ. ఫ్రీడంఫైటర్‌గా నటించాను. మనోజ్ బాజ్‌పాయ్ వంటి గొప్ప నటులతో పనిచేశాను.
హ్యాపీహ్యాపీగా నేపథ్యమేమిటి?
భారతీయతపై మమకారంతో లండన్‌నుంచి ఇండియా వస్తాను. ఇక్కడే అటువంటి భావాలు గల వరుణ్‌సందేశ్ పరిచయం అవుతాడు. కానీ అతని భావాలు విరుద్ధమని తర్వాత తెలుస్తుంది. కానీ అప్పటికే మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. అవి ఏమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా.
ముంబై నుంచి వచ్చేవారిని ఇండిస్ట్రీలో కొంతమంది విమర్శిస్తుంటారు? దీనిపై మీ స్పందన?
కళకు హద్దుల్లేవు. ఇది గ్లాలర్ ఫీల్డ్. అలాగని అందరూ బికినీలు, మిడ్డీలు వేసుకుని నటిస్తారనుకుంటే పొరపాటే.. పాత్ర మేరకే చేయాల్సివస్తే చేయాలి. లేదంటే.. వద్దనాలి. తెలుగులోనూ అలా చేసేవారూ ఉన్నారు. ఇక్కడ ఎవరూ ఎవర్ని బొట్టుపెట్టి పిలవరు. మనకై మనమే వస్తుంటాం. లక్ ఉంటే కొన్నాళ్ళుంటాం. లేదంటే తిరుగు టపానే.
మూడు భాషల్లో ఏం గ్రహించారు?
హిందీలో గ్లామర్‌కు అవకాశం. స్టైలిష్‌గా ఉంటాయి. తెలుగులో మాత్రం పూర్తి కమర్షియల్ సినిమాలే. తమిళం అందుకు భిన్నంగా, కొత్తదనంగా ఉంటాయి. సాంకేతికపరంగాకూడా ఇటీవలి మగధీర, అరుంధతి చిత్రాలు నిరూపించాయి.
మీ హాబీలు ఏమిటో తెలుసుకోవచ్చా...?
నాకు టెన్నిస్ అంటే ఇష్టం. స్టెఫీగ్రాఫ్ ఫ్యాన్‌ను. వింబుల్డన్ బాగా చూస్తా. ఖాళీ దొరికితే నిద్రపోతా.
తెలుగులో చాలా గ్యాప్ తర్వాత వచ్చారు?
అవును. ఇంతకుముందు చంద్రసిద్దార్ధ దర్శకత్వంలో 'హౌస్‌ఫుల్'లో నటించాను. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అనుకోకుండా హ్యాపీహ్యాపీగాలో అవకాశం వచ్చింది. ఇంకా రెండు చిత్రాలలో నటించమని అడుగుతున్నారు. ఇంకా ఫైనల్ చేయలేదు. ఎందుకంటే.. హ్యాపీహ్యాపీగా హిట్‌ను బట్టి స్టెప్ వేయాలనుకుంటున్నా.
