Varun Sandesh | Happy Happyga | Happy days | Sekhar Kammula | Maro Charitra | Evrina Eppudina | ఓనామాలు ఆయన వద్దే నేర్చుకున్నాను: వరుణ్ సందేశ్
WD
ప్రశ్న: ఇది మీకు ఎన్నో పుట్టినరోజు..?
జ : సినిమారంగానికి వచ్చాక ఇది నాలుగో పుట్టినరోజు. ఈ నాలుగేళ్ళు హ్యాపీగా సాగింది. నా 18వ పుట్టినరోజును 'హ్యాపీడేస్' సెట్‌లో చేశారు.
ప్రశ్న: 'మరోచరిత్ర' ఏ మేరకు మీకు ఉపయోగపడింది?
జ : నేను హీరో కాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. 'మరో చరిత్ర' అనే సినిమా చేయడం జీవితంలో అదృష్టంగా భావించాను. కానీ అది ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. ప్రతి సినిమాను ప్రత్యేకంగా చేయాలని అనుకుంటాను. అది కూడా అలా చేసిందే.
ప్రశ్న: ఇప్పటివరకు మీ సినిమాల ద్వారా ఏం నేర్చుకున్నారు..?
జ : నాకంటూ ఓ దారిని చూపించింది 'హ్యాపీడేస్'. రెండవ చిత్రమే ఏవీఎం వారిది. సంస్థలో 'ఎవరైనా ఎప్పుడైనా' చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ చిత్రంలో చాలా నేర్చుకున్నాను. మరో చరిత్ర లెజెండ్ మూవీ. కమల్‌హాసన్ చేసిన పాత్రలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దిల్‌రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.
ప్రశ్న : హ్యాపీ హ్యాపీగా ఎలా ఉంటుంది?
జ : లవ్‌స్టోరీలో మంచి ఫీల్ గుడ్ సినిమా. ఎదుటివారు సంతోషంగా ఉండాలని కోరుకునే పాత్ర నాది. ఈ చిత్రం కొన్ని ఏళ్ళపాటు చెప్పుకునేట్లేగా ఉంటుంది. ఈ తరంతో పాటు రేపటి తరానికి కూడా నచ్చే కథాంశం.
ప్రశ్న : మణిశర్మ ఎలాంటి సంగీతం ఇచ్చారు?
జ : నాకు మణిశర్మ సంగీతమంటే చాలా ఇష్టం. ఎవరైనా ఎప్పుడైనా చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించారు. ఇందులో ఆరు పాటలున్నాయి. ఒక్కో పాట ఒక్కో తరహాలో ఉంటుంది. సాహిత్యం సీతారామశాస్త్రి రాశారు. అదే చిత్రానికి ప్లస్ పాయింట్.
ప్రశ్న: మీకు లేడీస్ ఫాలోయింగ్ పెరుగుతుందని తెలిసింది..?
జ: నేను చేసిన సినిమాలన్నింటికి మార్నింగ్ షోకు వెళతాను. ఆ షోల్లో కాలేజీ అమ్మాయిలు కూడా ఉంటారు. ఈ విధంగా నన్ను ఆదరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. యువకులను కూడా నా చిత్రాలు చూడాలనిపించేలా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను.
ప్రశ్న: ఇండస్ట్రీలో మీ స్నేహితులు ఎవరెవరు..?
జ : ప్రతివారూ స్నేహితులే. కానీ ఎవరితో ఎక్కువగా ఫోన్లలో టచ్‌లో ఉంటాను. నాకు మొహమ్మాటం ఎక్కువ. అల్లరి నరేష్ బాగా ఇష్టం. ఏడాదికి 8 సినిమాలు ఎలా చేస్తాడా? అని ఆశ్చర్యమేస్తుంది. అంత డెడికేషన్ ఎలా వస్తుందనే అనిపిస్తుంది.
ప్రశ్న: హిట్, ఫ్లాప్‌లను ఎలా రిసీవ్ చేసుకుంటారు?
జ : హిట్ అయితే నేర్చుకునేది ఏమీ ఉండదనిపిస్తుంది. అదే ఫ్లాప్ అయితే దీనివల్ల అయింది. ఇది చేయకూడదు. ఇది ఇలా ఉండకూడదు. అనే విషయాలే నేర్పిస్తాయి.
ప్రశ్న: ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు?
జ: నా తండ్రి పార్థసారథిగారు నటుడు. ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. నేను ఇంజనీరింగ్ చేశాను. యు.ఎస్.లో ఉండేవాడిని. ఒకరోజు అనుకోకుండా నెట్‌లో హ్యాపీడేస్ గురించి కొత్తవారు కావాలనే ప్రకటన చూశాను. ఏదో సరదాగా మా నాన్నగారు అప్లై చేయించారు. వెంటనే ఆడిషన్ జరగడం. శేఖర్‌కమ్ముల ఓకే అనడం జరిగిపోయాయి. నిజంగా నటన ఎలా ఉంటుంది. నటనా పరంగా ఓనామాలు ఆయన వద్దే నేర్చుకున్నాను.
WD
ప్రశ్న: కొత్త సినిమాలు?
జ: ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్నాను. ఆ షూటింగ్‌లోనే బర్త్‌డే జరుపుకుంటాను. ఇందులో కాజల్ సోదరి నిషా అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆ తర్వాత 'కుదిరితే కప్పు కాఫీ' అనే చిత్రంలో నటిస్తున్నాను. వచ్చేనెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మరో చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయి.
