Ram Gopal Varma | Gayam 2 | Jagapati Babu | నన్ను నమ్మేది మూర్ఖులే: రామ్ గోపాల్ వర్మ
WD
అయితే ఎక్కడ ఏ ఇంటర్య్వూ ఇచ్చినా చాలా కేర్‌లెస్‌గా చెపుతుంటాడు. తాజాగా ఆయన సమర్పణలో గాయం - 2 చిత్రం రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ఆయనతో కాసేపు....
మీరు దర్శకత్వం వహించిన "గాయం"కు సీక్వెల్ మీరు చేయకపోవడానికి కారణం...?
నాకు ఇప్పటి కథ నచ్చలేదు. జగపతిబాబు ఈ సినిమా చేద్దామని నాతో అన్నప్పుడు 15 ఏళ్లనాటి సినిమా ఇది. దాన్ని నేను కూడా మర్చిపోయాను. ప్రేక్షకులు కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఎవరు చూస్తారని అన్నాను. చిత్ర దర్శకుడు ప్రవీణ్ కథ చెప్పినప్పుడు ఏవిధంగా తీయగలడు అని అన్నాను. అయితే అతను చెప్పిన విధానం అతనిపై జగపతిబాబుకు పూర్తి నమ్మకముంది. ప్రవీణ్ నాతో కొన్ని చిత్రాలకు పని చేశాడు.
ప్రోమోస్‌లో ఓల్డ్ సిటీ చూపించి రక్తం చిందించే సన్నివేశాలున్నాయి. అంటే ఓల్డ్ సిటీ గొడవలేమైనా చూపించబోతున్నారా...?
సినిమా అన్న తర్వాత రకరకాలుగా చూపించే ప్రయత్నం చేయాలి. ఓల్డ్ సిటీ గొడవలనేవి కచ్చితంగా ఏమీ చెప్పలేదు. అన్ని గొడవలు ఇందులో ఉంటాయి.
అయితే తెలంగాణా ఇష్యూను ఎలా డీల్ చేశారు..?
ప్రత్యేకించి తెలంగాణా ఇష్యూ అనేది ఏమీ లేదు. రాజకీయ గొడవల్లో భాగమే అది. అసలు తెలంగాణా గొడవ ఉందా లేదా అనేది కూడా సినిమా చూస్తేనే తెలుస్తుంది.
"గాయం"లో 'నిగ్గదీసి అడుగరా సిగ్గులేని సమాజాన్ని..' అని అన్నారు. మరి ఇందులో ఏమనబోతున్నారు..?
అందులో అన్నదానికంటే కొంచెం ఎక్కువగా తిడుతున్నాం. కథనుబట్టి అలా వచ్చింది. సమాజం మారిందా.. ఇంకా మారాలా..? అన్నది సస్పెన్స్
శివ.. గాయం.. ఆ తర్వాత మరో సీక్వెల్ ఏమైనా వస్తుందా...?
చెప్పలేను. ఏదైనా చేయవచ్చు.
దెయ్యం, భూతం అంటూ భయపెట్టి మళ్లీ హత్యలపై ఎక్కుపెడుతున్నారు..?
ఇప్పటి ట్రెండ్ అదే. ఎపుడూ ట్రెండ్ మారిపోతుంటుంది. ఓ వారం పరిస్థితుల్లా రాబోయే వారం పరిస్థితులు ఉంటాయా...? మారుతున్న ట్రెండ్‌ను బట్టి వెళ్లాల్సిందే.
రక్త చరిత్ర ఎంతవరకు వచ్చింది..?
షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. గాయం -2 సెప్టెంబరులో విడుదలవుతుంది. రెండు వారాల తేడాతో రక్తచరిత్ర విడుదలవుతుంది.
సీరియస్ చిత్రాల నుంచి ఒక్కసారిగా "అప్పల్రాజు.." అనే చిత్రంవైపు మారడానికి కారణం...?
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అప్పల్రాజు అనే చిత్రాన్ని నిర్మిస్తానని అన్నాను. ఎందుకంటే ఆ కథ నాకు నచ్చింది. అందుకే చేయాలనుకున్నాను. అయినా ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు. నా మాట నమ్మటం అంత మూర్ఖత్వం మరోటి ఉండదు.
చిత్ర జయాపజయాలను ఎలా బేరీజు వేస్తారు..?
నేను ఒక్కసారి సినిమా తీశాక దాని గురించి ఆలోచించను. అది హిట్టయినా, ఫట్టయినా పట్టించుకోను. శివ తీసిన తర్వాత ఆ చిత్రం గురించి తనికెళ్ల భరణి వచ్చి.. సార్.. శివలో.. అంటూ.. ఏదో చెప్పబోయాడు. వెంటనే ఆ విషయం తప్పించి వేరే మాట్లాడు అని చెప్పా. నా పాలసీ తెలిసినవాళ్లు నేను చేసిన గతాన్ని గురించి మాట్లాడరు. ఒక్క మీడియా తప్ప.
గొప్ప దర్శకుడిగా మీరు చేసింది కరెక్టో కాదో అని ఎవరికైనా ఉంటుంది కదా...?
అలా ఉండాల్సిన అవసరం ఏముంది. నాకే లేనప్పుడు మిగతావారికి ఎందుకంత ఇంట్రెస్ట్ అని ముగించారు.
