1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
  4. Interview

Taapsi | Interview | Sexy actress | ఇక్కడైతే రోజుకో కొత్తదనం చూడొచ్చు: తాప్సీ

తాప్సి
తాప్సీ.. సినిమాల్లో ఆమె పేరు యూత్‌కు తెలియందికాదు. మొదట్లో తనపేరు ఎవరికీ తెలియదేమో, ఎవరూ గుర్తుపట్టరేమో అనుకున్నదట. తర్వాత సినిమాలు సక్సెస్‌ కావడంతో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. దాంతో తనపై తనకే నమ్మకం పెరిగింది. హిందీలో కూడా నటిస్తున్న తాప్సీ.. తాజాగా రవితేజ చిత్రంలో నటించడానికి సిద్ధమైంది. ఆమె చెప్పిన కబుర్లు..

 
WD
హీరోయిన్లు ఎక్కువగా జర్నీలు చేస్తుంటారు. ఎలా అనిపిస్తుంది?
నాకు చాలా చికాకు పుడుతుంది. గంటలపాటు ప్రయాణం బోర్‌.. వెళ్ళేది విమానమైనా సరే షూటింగ్‌ కోసం తప్పనిసరై వెళ్ళాల్సి వస్తుంది.అదే కారులోనే, రైలులోనే వెళితే... మనం కిటికీ పక్కన కూర్చొని చూస్తుంటే.. చెట్లు రయ్‌మంటూ వెళ్లిపోతుంటాయి. అలా గాలిలో మనం కూడా ఎగిరిపోతే ఎంత బాగుండో అనిపించింది. లేదంటే.. ఏదైనా మిషన్‌ ఉంటే రోబోలా వెళ్ళిపోవచ్చు.

 
WD
మీరిమధ్య అందాన్ని బాగా చూపిస్తున్నారు?
అందంగా ఉన్నాను కాబట్టే నాకు సినిమాలు వస్తున్నాయి. ఎక్స్‌పోజింగ్‌ అనేది సినిమాను బట్టి చూపిస్తుంటాను. బయట చాలా నార్మల్‌గా ఉంటాను.

 
WD
ఎలాంటి వ్యక్తిని మనువాడాలనుకుంటున్నారు?
ఎవరితో రాసిపెట్టి ఉందో తెలీదు. నా వృత్తిని అర్థం చేసుకుని నన్ను ప్రేమించేవాడు కావాలి.

 
WD
సినిమా లైఫ్‌ ఎలా ఉంది?
నాకు అనుకున్నట్లే ఉంది.. ఈ రంగం లేకపోతే.. రోజూ తొమ్మిది టు ఆరు గంటలవరకు ఏదో ఉద్యోగం చేయడం. రొటీన్‌ లైఫ్ అయిపోతుంది. ఈ రంగంలో రోజుకో కొత్తదనం ఉంటుంది. పాత్రలు కూడా కొత్తగా ఉంటాయి. రకరకాల వ్యక్తులు పరిచయాలు, ఎన్నో విషయాలు తెలుసుకోవడం ఇక్కడే సాధ్యం.

 
WD
మీ గ్లామర్‌ రహస్యం?
రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతున్నా..వేళకు తిండి తింటున్నా.. మోతాదుకు మించి తినను. ఫ్రూట్స్‌ జ్యూస్‌ బాగా తాగుతాను.

 
WD
గాసిప్స్‌‌పై ఎలా స్పందిస్తారు?
అవి వినడానికి బాగుంటాయి. నా గురించి చాలానే కొన్ని వెబ్‌సైట్లలో రాసేశారు. ఇలా కూడా రాస్తారా అనిపించేది. అయితే వాటిని పట్టించుకోకూడదని తెలుసుకున్నాను అని చెప్పింది తాప్సీ
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT