Sneha Ullal | Aishwarya Rai | Dukudu | Mahesh Babu | Madata Kaja | Alllari Naresh | "ఐష్"తో పోలిస్తే మాత్రం కోపం వచ్చేస్తుంది..!: స్నేహాఉల్లాల్
WD |
ప్రశ్న : మిమ్మల్ని అంతా ఐశ్వర్యారాయ్ అంటుంటారు. మీరెలా ఫీలవుతున్నారు?
జ: చిన్నప్పుడు నేను చాలా బొద్దుగా. బ్లూ ఐస్‌తో ఉండేదాన్ని. తర్వాతర్వాత కాస్త ఒళ్ళుతగ్గింది. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడే ఐశ్వర్యరాయ్ మిస్ ఇండియాగానే ఎంపికైంది. అప్పుడే చుట్టుపక్కలవారూ ఐశ్వర్యరాయ్‌తో పోల్చారు. దాని
వల్ల సినీ కెరీర్‌కు నష్టం జరుగుతుంది. అందుకే నాకు నేనుగా ఉండటమే ఇష్టమే. పోలిస్తే మాత్రం కోపం వచ్చేస్తుంది.
ప్రశ్న: మడతకాజా ఎవరు తినిపిస్తారు?
జ: అది సినిమాలో చూడాల్సిందే. హీరోకు నేనా, నాకు హీరోగా అనేది ఇంట్రస్ట్‌గా ఉంటుంది. ఈ చిత్ర కథ విన్నప్పుడే ప్రత్యేకమైన పాత్రలా అనిపించింది. పాజిటివ్ ఎనర్జీలోనాలో ప్రవేశించింది. ఆధునిక యువతిగా కన్పిస్తాను. ఇదివరకు నేను ఎన్ని పాత్రలు చేసినా లభించని సంతృప్తి ఈ పాత్రలో దొరికింది.
ప్రశ్న: తెలుగులో డబ్బింగ్ ఎప్పుడు చెబుతున్నారు?
జ : త్వరలో చెప్పేస్తాను. ఇప్పుడు తెలుగుకూడా నేర్చుకుంటున్నాను. ట్యూటర్‌కూడా ఉన్నాడు. 75 శాతం వచ్చేసింది. కొద్దికొద్దిగా మాట్లాడతాను. చెప్పింది అర్థం చేసుకుంటాను. సినిమాలో డైలాగ్స్‌కూడా ముందురోజు నా రూమ్‌కు తీసుకువచ్చేవారు.
దానివల్ల సీనియర్స్‌తో నటించేటప్పుడు చాలా ఈజీగా ఉండేది. విరామం దొరికితే సంభాషణలు చదువుకుంటూ గడిపేదాన్ని. నా కష్టానికి తగిన ప్రతిఫలం ఈ చిత్రం ద్వారా వస్తుంది.
ప్రశ్న: సింహా సక్సెస్‌ను మీరు సరిగ్గా ఉపయోగించుకోలేదేమనిపిస్తుంది?
జ: ఈ మాట చాలామంది అన్నారు. కానీ నా హెల్త్‌ప్రాబ్లమ్ వల్ల దూరంగా ఉండాల్సి వచ్చింది. వెన్నెముకలో డిస్క్ ప్రాబ్లమ్ వచ్చింది. ఏడాదిపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఇంకా ఎక్కువ రెస్ట్‌తీసుకుంటే కెరీర్ ముగిసినట్లేనని అప్పుడప్పుడూ చేయాల్సివస్తుంది. అలా మొదలైంది..తర్వాత మడతకాజా చేశాను. డాన్స్ చేసేటప్పుడు నడుం నొప్పిగా ఉంటే డాక్టర్ల సలహామేరకు మందులువాడి డాన్స్ చేసేదాన్ని.
ప్రశ్న: అల్లరి నరేష్‌తో నటించడం ఎలా అనిపించింది?
జ: నిజం చెప్పాలంటే.. సల్మాన్ ఖాన్ 'లక్కీ'తో చేసేటప్పుడు బెరుకుగా ఉండేది. రానురాను అది పోయి చాలా ఈజీనెస్ వచ్చింది. అది మడతకాజాలో కన్పిస్తుంది. నరేష్ తన ఫాదర్ చనిపోయాక చాలా సాఫ్ట్‌గా ఉంటున్నారు. రొమాన్స్‌సీన్స్‌లో వేరేవారితో
రిహార్సల్స్ చేశాక.. నాతో చేస్తున్నాడు. లేడీస్ అంటే చాలా గౌరవం. కామెడీ చిత్రాలకు టైమింగ్ ముఖ్యం. నరేస్‌లో నాకు బాగా కన్పించింది.
ప్రశ్న: మేకప్‌కు ప్రాదాన్యత ఇవ్వరని అంటుంటారు?
జ : అవును. మేకప్‌లేకుండా మామూలు స్నేహా ఉల్లాల్ ఎలా ఉంటుందో అలా ఉంటాను. నాకు చిన్నతనం నుంచి మేకప్ అంటే పడేదికాదు. విధివిచిత్రం... అనుకోకుండా నటిని అయ్యాను. మా ఇంట్లో అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా ఫాదర్ మంగుళూరు. తుళు మాతృభాష. ఐఐటి చేశారు. ఏ సబ్జెక్ట్ గురించి అనర్గళంగా మాట్లాడతారు. నేను చదివింది ట్వల్త్ స్టాండెర్డ్. అప్పుడే లక్కీలో ఛాన్స్ వచ్చింది.
ప్రశ్న: దేవుడ్ని నమ్ముతారా?
జ: నాకు భక్తిఎక్కువ. ఏదీ మనం అనుకున్నట్లు జరగదు. ముందుగానే రాసిపెట్టినట్లు.. మన జీవితంలోని సంఘటనలు ఒక్కోక్కటి అలా జరుగుతూ పోతుంది. నేను నటిని కావాలని అనుకోలేదు. కానీ నటిని అయ్యాను. నాకు కూడా అవకాశాలు ఒకదాని
తర్వాతే ఒకటివస్తున్నాయి. ఇది కూడా గాడ్ ప్లాన్ ప్రకారమే చేయిస్తున్నాడనుకుంటాను.
ప్రశ్న: నటికాకపోతే..?
జ: బాగా చదువుకుని.. ఏనిమల్ ఆసుపత్రి నడిపేదాన్ని.. భవిష్యత్‌లోకూడా అది చేయాలనుంది. జంతువులను ప్రేమించాలి. అవికూడా మనలాగానే ప్రాణులే. అందుకే నేను శాఖాహారిని. మాంసాహారం తినను. ఒక ప్రాణిని చంపి తినడం నాకు నచ్చదు.
ప్రశ్న: ఎటువంటి పాత్రలు చేయాలనుకుంది?
జ: నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రనుచేయాలనుంది. అందులోనూ ఎమోషనల్ పాత్రలంటే మరీ ఇష్టం. నా డ్రీమ్‌రోల్ సైకోకిల్లర్‌గా నటించాలని.
ప్రశ్న: హిందీ చిత్రాలకు దూరంగా ఉండడానికి కారణం?
జ : ఒక్కటే.. నేనింకా చిన్నపిల్లలాగే ఉన్నావని అందరూ అంటుంటారు. లక్కీలో చేసేటప్పుడు పిల్లలా ఉన్నావని అన్నారు. ఇంకొంచెం వయస్సురానీయ్ అనేవారు. అందుకే నేను అటువైపు తిరిగి చూడలేదు. నా దృష్టంగా దక్షిణాది చిత్రాల్లో నటించడమే.
ప్రశ్న: పబ్‌లకు వెళుతుంటారా?
జ: ఖాళీగా ఉంటే... చాలామందికి షాపింగ్‌లకు, పబ్‌లకు వెళుతుంటారు. నాకు మాత్రం డ్రింకింగ్ అంటే భయం. అది తాగేవారన్నా అయిష్టం.
ప్రశ్న: ఒకవేళ మీ పార్టనర్ అలవాటుంటే?
జ: అటువంటి ప్రశ్నేలేదు. అలాంటివాడిని పార్టనర్‌గా అంగీకరించను.
ప్రశ్న: మీ హాబీస్?
జ: స్కూల్‌డేస్‌లోనే హాకీ ప్లేయర్‌ను. ఖాళీదొరికితే హాకీ ఆడతాను. సంగీతం వింటాను. జంతువులను ప్రేమిస్తాను.
ప్రశ్న: మీకిష్టమైన వంటకం?
జ : శాకాహారంలో ఏదైనా తినేస్తాను. 'ఐ ఈట్ లైక్ డాగ్'. పిచ్చిపిచ్చిగా తినేస్తాను. కంట్రోల్ ఉండదు. కానీ.. లావు మాత్రం రావడంలేదు.. అంటూ ముగించింది.
