Naga Chaitanya | Dada | Bejawada | Akkineni | Nagarjuna | ఇసుమంతైనా అదృష్టం ఉండాలి : నాగచైతన్య
File
FILEఅయినా మొక్కవోనీ దీక్షతో మళ్ళీ మాస్ ఇమేజ్ కోసం 'ఆటోనగర్ సూర్య'తో ట్రై చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసి ఆయనతో చిట్‌చాట్.
** 'ఆటోనగర్ సూర్య'లో రెండు పాత్రలుపోషిస్తున్నారా?
ఇందులో 15 యేళ్ల అబ్బాయిగా, 25 యేళ్ళకుర్రాడిగా కన్పిస్తా. డ్యూయల్ రోల్ కాదు. ఇది కొత్తతరహాలో ఉండే సినిమా. దేవకట్టా ప్రస్తానం సినిమా చూశాను. చాలా బాగుందని చెప్పాను. దాంతో ఆయనే ఓ కథను తీసుకు వచ్చారు. ఫస్ట్‌టైమ్‌లోనే నాకు బాగా నచ్చింది.
** మూడుతరాలు నటిస్తారని మీ తాతగారు చెబుతుండేవారు?
అది ఇంకా కొలిక్కిరాదు. నిజంగా నాకూ కలిసి నటించాలనుంది. తాతయ్య, నాన్న, నేను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఒకరిద్దరు కథలు చెప్పారు కానీ.. అవేవీ ఎట్రాక్ట్‌గా ఉండలేదు.
** ఫెయిల్యూర్ అయిన సినిమాలనుంచి ఏమి నేర్చుకున్నారు?
కొన్ని కథలు వినడానికి బాగుంటాయి. కొన్ని తీయడానికి బాగుంటాయి. మొదటి రకం కథను తెరపైకి తెచ్చేటప్పుడు సరిగ్గా ప్రెజెంటేషన్ చేయలేకపోతే 'దడ', 'బెజవాడలా' ఫెయిల్ అవుతాయి. ఇది ఏ ఒక్కరినీ నిందించాలన్న ఉద్దేశ్యంతో చెప్పలేదు.
** బెజవాడ అనే భారీ కథ విన్నప్పుడు మీకు సరిపోతుందో లేదా! అని ఆలోచన కలగలేదా?
ఇందాక చెప్పినట్లు...విన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది.. కానీ తెరపైనే నాకు సూటకాలేదని అన్నారు.
** ఇన్ని సినిమాల తర్వాత మీరు నేర్చుకున్నదేంటి?
ఏదైనా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఒక్కోసారి ఎంత కష్టపడ్డా... దానికి తగిన ఫలితం రాదు. అదృష్టం అనేది ఇసుమంతైనా ఉండాలని మాత్రం గ్రహించాను.
** యూత్ హీరోలతో ఎలాంటి సంబంధాలున్నాయి?
యూత్ హీరోలంతా మంచి స్నేహితుల్లా ఉంటాం. అల్లు అర్జున్, రానా, ఎన్టీఆర్.. రామ్‌చరణ్ వీల్ళంతా చాలా జోవియల్‌గా ఉంటారు. మంచి ఫ్రెండ్స్ కూడా. కూడా.
** ఇటీవల మీపైపుకార్లు వచ్చాయి. దానిపైమీ రెలా స్పందిస్తారు?
పుకార్లనేవి పుకార్లే... నేను ఎవరితోనే దగ్గరగా ఉన్నాననీ, పెండ్లి చేసుకుంటున్నానని.. రాస్తున్నారు. అవన్నీ అబద్దాలే. అవి రాసేటప్పుడు తెలుసుకుని రాస్తేమంచిది. లేదంటే.. కుటుంబానికే బ్యాడ్‌నేమ్ వస్తుంది కదా అంటూ ముగించారు.
