1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. Tollywood,

Archana Interview | Tollywood, | ఆక్షేపణ లేనంతవరకూ అందాలు చూపిస్తా: అర్చన

అర్చన ఇంటర్య్వూ
WD
తెలుగు నటిగా అందరికీ తెలిసిన వేద తర్వాత అర్చనగా పేరు మార్చుకుంది. శ్రీరామదాసులో సీతగా నటించినా, బ్యాంక్‌ చిత్రంలో అధునాతన లేడీగా నటించిన అర్చన మంచి డాన్సర్‌. డాన్స్‌ చేసే పాత్రలు వస్తే ఎగిరి గంతేస్తానని చెబుతోంది. తెలుగులో అవకాశాలు తక్కువైనా తమిళంవైపు బాగానే ఉన్నాయని అంటున్న అర్చన... తాజాగా నందమూరి తారకరత్నతో నటిస్తోంది. వీరు కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీతగా కూడా కన్పించనుంది. ఈ సందర్భంగా అర్చనతో చిట్‌చాట్

తెలుగు నటిగా అవకాశాలెలా ఉన్నాయి?
తెలుగులో ఇప్పటికి 20 సినిమాలు చేశాను. నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, సామాన్యుడు, శ్రీరామదాసు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. కానీ ఆ తర్వాత పెద్దగా మంచి పాత్రలు రాలేదు. కారణాలేమైనా... తెలుగు నటిగా ఇంకా మంచి పాత్రలు పోషించాలనుంది. కానీ ఇక్కడకంటే తమిళంలోనే బాగా వస్తున్నాయి.

పబ్‌ల్లో ఎక్కువగా కన్పిస్తారనే వార్తలు వస్తున్నాయి?
ఎప్పుడైనా షూటింగ్‌ లేకుండా ఉంటే.. ఆరోజు స్నేహితులతో కలిసి వెళ్తుండేదాన్ని. కానీ పబ్‌లకు వెళ్ళి చాలాకాలమైంది. అక్కడ రకరకాల వార్తలు వ్యాపించడంతో మానేశాను.

ఇప్పటివరకు ఏయే భాషల్లో నటించారు?
తమిళం, కన్నడ చేశాను. కన్నడలో రెండు సినిమాలు విజయం సాధించాయి. 'ఆ దినగల్‌' అనే చిత్రం 175 రోజులు ఆడింది.

హీరోయిన్లు ఐటం సాంగ్‌ కూడా చేస్తున్నారు. మీరు సిద్ధమేనా?
నేను క్లాసికల్‌ డాన్సర్‌ను. ఐటం సాంగ్‌ చేయడమంటే చాలా ఇష్టం. దబాంగ్‌లో 'మున్నీ బద్‌నాం' లాంటి పాటను చేయాలనుంది. గబ్బర్‌సింగ్‌లో ఆ పాట నాకిస్తే ఎంత బావుణ్ణు అనిపించింది. నా టాలెంట్‌ నిరూపించుకునేదాన్ని.

అటువంటి సాంగ్‌లో ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువగా చేయాలి కదా?
ఎక్స్‌పోజింగ్‌ అనేది ఆ పాట సన్నివేశాన్ని బట్టి ఉంటుంది. నేనెంచుకున్న ప్రొఫెషన్‌ పట్ల నాకు పూర్తి క్లారిటీ ఉంది. క్యారెక్టర్‌ డిమాండ్‌ను బట్టి వస్త్రధారణ వేసుకుకోవడంలో తప్పులేదు. మరీ ఎక్కువైనా ప్రేక్షకులు చూడరు. ఆక్షేపణ లేనంతవరకూ అందాలు చూపించడంలో అభ్యంతరం లేదు.

సీత పాత్రను పోషించిన మీరు ఈ తరహా చేయాలనుకోవడంలో ఆంతర్యం?
ఎంతోమంది మంచి పాత్రలు పోషించినవారు ఉన్నారు. ఆ తర్వాత విరుద్ధమైన పాత్రలు చేశారు. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు రావాలనుకోవడం, వస్తాయనుకోడం పొరపాటే. ఏదీ మన చేతుల్లో లేదు. నయనతార వంటి తార సీతగా నటిస్తుంటే ఎన్నో కామెంట్లు విన్పించాయి. చివరికి వారి నోర్లు మూయించేలా నటించింది నయన. అది ఆమె అదృష్టం.

'మైక్‌ సెట్టింట్‌ 143'లో పాత్ర ఎలా ఉంటుంది?
తారకరత్నతో చేస్తున్న తొలి సినిమా. ఇంతవరకూ పెద్ద హీరోలతో చేశాను. ఈ పాత్ర నన్ను చాలా ఇన్‌స్పైర్‌ చేసింది. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్ర. ఇప్పటివరకు చేయలేదు. అది ఈ చిత్రం ద్వారా వచ్చింది. ఇందులో తారక్‌ రాముడిగా, నేను సీతగా కన్పిస్తాను. అది ఓ సందర్భంలోనే. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు వస్తుందనే కాన్‌ఫిడెన్స్‌ ఉంది.

ఇంకా మీ తదుపరి చిత్రాలు?
నవదీప్‌ హీరోగా 'ఎవరైనా ఎప్పుడైనా', తర్వాత శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వంలో 'ఓయ్‌'. ఆనంద్‌ రంగ దర్శకత్వంలో హారర్‌ సినిమా చేస్తున్నాను. దానికి 'పొగ'పేరు పెట్టారు. ఇది 3డి సినిమా కావడం మరో విశేషం. ఇది కాకుండా తోటకృష్ణ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని సినిమాలో డ్యూయెల్‌ రోల్‌ ప్లే చేస్తున్నా. ఇది కాకుండా హిందీలో ఆమధ్య ఆఫర్‌ వచ్చింది. ఇంకా ఫైనల్‌ కాలేదు అని ముగించింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT