గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » ఈనెలాఖరులో "దుబాయ్ శీను"
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
యూనివర్శల్ మీడియాపై జె.భగవాన్ సమర్పణలో నిర్మాత డి.దానయ్య రవితేజ హీరోగా నిర్మిస్తున్న "దుబాయ్ శీను" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి భాగం దుబాయ్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంది. "దుబాయ్ శీను"గా రవితేజ నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్ నయనతార నటిస్తోంది. ప్రముఖ హీరో జేడీ.చక్రవర్తి ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

రవితేజ, నయనతార గ్లామర్ ఈ చిత్రానికి మంచి హైలెట్‌గా అవుతుందన్నారు. మణిశర్మ మంచి సంగీత బాణీలను అందించారని, ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని శ్రీను వైట్ల చెప్పారు. "దేశమదురు" చిత్రం తర్వాత నిర్మాత దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని ఈనెలాఖరులో విడుదల చేయనున్నట్టు నిర్మాత దానయ్య వెల్లడించారు.