''మంత్ర'' సినిమాపై అందాల ఛార్మీ ఆశలు
తెలుగు చిత్ర సీమలో సరైన అవకాశాలు లభించడం లేదని కన్నడ చిత్ర రంగంవైపు కన్నేసిన సినీ నటి ఛార్మీ తాజాగా మంత్ర అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంపై ఆమె బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. జనరేషన్ నెక్ట్స్ మూవీస్ పతాకంపై కళ్యాణ్ రామ్, రవి ప్రకాష్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'మంత్ర 'సినిమాలో ఛార్మీ ప్రధాన పాత్రను పోషిస్తోంది. తులసీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌లో ఉంది.
ఒక అందమైన అమాయక అమ్మాయి జీవితంలో చోటుచేసుకునే అనూహ్య సంఘటనల సమాహారమే 'మంత్ర' సినిమా అని నిర్మాతలు పేర్కొంటున్నారుప. 'మంత్ర'గా ఛార్మీ అద్భుతంగా నటిస్తోందని, ఇది ఆమె కెరీర్‌కు తప్పక దోహదపడుతుందని యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏదీ ఏమైనా తెలుగు తెరపై మంత్రముగ్ధ ఛార్మీ మళ్లీ తళుక్కుమనబోతోంది. ఆమెకు.. ఈ చిత్రమైన విజయం చేకూర్చి పెట్టాలని బెస్ట్ ఆఫ్ లక్ చెపుదాం.