పూరి తదుపరి చిత్రం ''షాడో''లో శ్రియా..!
'శివాజీ' చిత్రం తర్వాత నటి శ్రియాకు మంచి అవకాశాలు వస్తాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అటు తమిళంలోను ఇటు తెలుగులోనే కాకుండా హిందీలోను సినిమా అవకాశాలు వస్తున్నాయి. హిందీలో ప్రస్తుతం 'అపరవన్' సినిమా అవకాశాన్ని కొట్టేసిన శ్రియాకు తెలుగులో అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. తాజాగా మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చిందని సంతోషపడుతున్న తరుణంలోనే తెలుగులో మరో అవకాశం వచ్చింది.
డిటెక్టివ్ నవలలకు పెట్టింది పేరయిన మధుబాబు రచించిన ప్రఖ్యాత నవల 'షాడో' నవలను సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కె.ఎస్.రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై నిర్మించనున్న సినిమాలో శ్రియా అవకాశం కొట్టేసింది.
'షాడో' పేరుతోనే సినిమా రూపొందనున్న ఈ సినిమాలో అతి తక్కువ డైలాగులు ఉండనుండటం విశేషం. కాగా శ్రియా, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన 'ఛత్రపతి' సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించిన విషయం తెల్సిందే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న షాడో సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.