''ఒంటరి''గా రానున్న గోపీచంద్
ఈతరం ఫిలిమ్స్ సంస్థ తాజాగా 'ఒక్కడున్నాడు' హీరో గోపీచంద్‌తో మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రానికి "ఒంటరి" అనే టైటిల్‌ను ఖరారు చేసింది. 'నవభారతం' నుంచి, నిన్నటి 'రణం' చిత్రం వరకు పలు విజయాలు అందించిన సంస్థగా పేరున్న ఈతరం ఫిలిమ్స్ తన 14వ చిత్రంగా 'ఒంటరి'ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'గౌరి' ఫేమ్ బీవీ.రమణ దర్శకత్వం వహించనున్నారు.
దీనిపై ఈతరం సంస్థ అధినేత పోకూరీ బాబూరావు మాట్లాడుతూ.. గోపీచంద్ హీరోగా తమ సంస్థ నుంచి వస్తున్న 'ఒంటరి' చిత్రం తప్పకుండా మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భావనను ఎంపిక చేసినట్టు చెప్పారు.
తమిళంలో 'చిత్తిరం పేసుదడి', 'వెయిల్', 'దీపావళి' చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ఈ భామకు తెలుగులో ఇదే తొలి చిత్రమన్నారు. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న 'ఒంటరి'కి ఇతర సాంకేతికవర్గం, నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని పోకూరి బాబూరావు తెలిపారు.