పెళ్ళయ్యింది కానీ...’ తొలి షెడ్యూల్ పూర్తి
ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రాశి మూవీస్ పతాకం అధినేత ఎమ్.నరసింహారావు నిర్మిస్తున్న ‘పెళ్ళయ్యింది కానీ...’ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. హీరో నరేశ్, హీరోయిన్ కమలినీ ముఖర్జీ, హరీశ్, చంద్రమోహన్, భానుప్రియ, కోట, సునీల్, కృష్ణభగవాన్, హర్షవర్థన్, మల్లికార్జునరావు, ఎమ్మెస్ నారాయణ, సన, ప్రగతి, రజిత తదితరులు పాల్గొనగా జూన్ ఒకటి నుండి ఇరవై వరకూ తొలి షెడ్యూల్‌ను జరిపామని నరసింహారావు తెలిపారు.
ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, “ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత భాగ్యరాజా అందించిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. జూలై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు రాజమండ్రి పరసరాల్లో రెండు పాటలు చిత్రీకరించామన్నారు. ఆగస్టు ఒకటి నుంచి పది వరకు ఒక పాటను, బాలెన్స్ టాకీని వైజాగ్, అరకులోయలో చిత్రీకర్తిసాం. అదే నెల పన్నెండు నుండి ఇరవై రెండు వరకూ కాశ్మీర్‌లో మరో రెండు పాటలన్ని చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుంది” అని చ్పెపారు.
దర్శకులు ఇ.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, “సెంటిమెంట్, కామెడీ చక్కగా మిళితమైన కథ ఇది. ఈ సినిమా చూసి కంటతడిపెట్టని వారు, కడుపుబ్బ నవ్వని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. నాకు బాగా నచ్చిన ‘ఆమె’ సినిమా కంటే కూడా ఇది బెటర్ మూవీ అవుతుంది. నేనెంతో ఇష్టపడి చేస్తున్న సినిమా ఇది” అని అన్నారు. ఈ చిత్రానికి కథ: కె.భాగ్యరాజా, మాటలు: వేగేశ్న సతీశ్, నాగరాజ్, బలరాం, మురళీమోహన్, పాటలు: వేటూరి, సుద్దాల అశోక్‌తేజ, వరికుప్పల యాదగిరి, జయసూర్య, ఎడిటింగ్: గౌతంరాజు, సంగీతం: కమలాకర్, జయశ్రి, ఫోటోగ్రఫీ: డి. ప్రసాద్‌బాబు.