1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

డబ్బింగ్ పనుల్లో 'పెళ్ళికాని ప్రసాద్‌'

గోదావరి ఫిలిమ్స్ పతాకంపై రమేశ్‌ కుమార్‌ ఆలపాటి
గోదావరి ఫిలిమ్స్ పతాకంపై రమేశ్‌ కుమార్‌ ఆలపాటి, సోమా విజయప్రకాశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పెళ్ళికాని ప్రసాద్‌’ చిత్రం డబ్బింగ్‌ చేసుకుంది. శివాజీ, నరేశ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్‌ ఇద్దరికీ వర్తిస్తుందని నిర్మాతల్లో ఒకరైన రమేశ్‌ కుమార్‌ తెలిపారు. “ఇద్దరి పేరూ ప్రసాదే. పెళ్ళికాని ఈ ప్రసాదులు ఎలాంటి ప్రేమాయణం సాగించారో తెర మీద చూడ్సాలిందేనని నిర్మాతలు తెలిపారు.

ఈ టైటిల్‌కు ట్యాగ్‌లైన్‌గా ‘పెళ్లైతే....’ అనే పదాన్ని పెట్టాం. అదే సినిమాకు కొసమెరుపు. ఇందులో శివాజీ, నరేశ్‌ పోటీపడి నటించారు. శ్రీదేవి గ్లామర్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర పోషించింది” అని అన్నారు. ప్రోగ్రెస్‌ను తెలియచేస్తూ, “రెండు పాటల చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్‌ ఉంది. జులై నెల మొదటివారంలో ఆడియో, నెలాఖరుకు సినిమాను విడుదల చేయాలనుకుం ట్నునాం” అని చెప్పారు.

శ్రీ అందించిన వినసొంపైన బాణీలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనే ఆశాభావాన్ని మరో నిర్మాత సోమా విజయ ప్రకాశ్‌ వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల రవికుమార్‌, చిర్రావూరి విజయకుమార్‌, రామజోగయ్య శాస్త్రి, కెమెరా: అంజి, ఎడిటింగ్‌: ఉపేంద్ర కుమార్‌, ఆర్ట్‌: రాజీవ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: త్రినాథ్‌ పెదిరెడ్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యం ద్వారపూడి.