గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » ఈనెల 30న రానున్న ఎస్వీకృష్ణారెడ్డి 'బహుమతి'
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
కుటుంబ కథా చిత్రాల దర్శకుడుగా పేరొందిన ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆర్.మూవీమేకర్స్ సంస్థ తాజాగా నిర్మించిన చిత్రం 'బహుమతి'. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో వేణు, సంగీత, షబానా ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో వస్తున్న ఈచిత్రం ఆడియో మంచి హిట్ సాధించింది.

దీనిపై అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ప్రేక్షకులకే కాకుండా చిత్రం యూనిట్ సభ్యులకు కూడా 'బహుమతి' ఓ బహుమతిగా అవుతుందన్నారు. గతంలో వచ్చిన 'శుభలగ్నం', 'మావిచిగురు' వంటి చిత్రాలకు ఏ మేరకు శ్రమించారో, అంతకంటే ఎక్కువగా ఈ చిత్రానికి దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి శ్రమించారని ఆయన వివరించారు. హీరో వేణు ఓ ప్రత్యేక క్యారెక్టర్‌లో కనిపిస్తాడని, అలాగే.. సంగీత కూడా కనిపిస్తుందన్నారు.