గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » జూలైలో విడుదలకు సిద్ధమైన "రుద్రమణి''
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
డబ్బున్న ప్రతి ఒక్కరూ చదువులేని పదిమందికి తమవంతు సాయం చేయాలనే సందేశంతో "రుద్రమణి'' చిత్రం రూపొందుతోంది. అబ్బాస్, తనూరాయ్ హీరోహీరోయిన్లుగా రాజీవ్‌కనకాల విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈదర రంగారావు నిర్మిస్తున్నారు.
Rudraveena
WD
ఖలీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రీరికార్డింగ్ పూర్తిచేసుకుని డీటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.


ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడూతూ ''సమాజానికి ఉపయోగపడే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సందేశానికి వినోదం మేళవించి అశ్లీలతకు తావులేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాం. విభిన్న కోణాలుగల పాత్రను అబ్బాస్ పోషించాడు. డూప్‌లేకుండా ఫైట్స్ కూడా చేయడంతో అబ్బాస్ గాయపడ్డాడు. అందుకే కొద్దిరోజులపాటు షూటింగ్ ఆలస్యమయింది. ఈ చిత్రంలో వేటూరి రాసిన శివతాండవం హైలైట్‌గా నిలుస్తుంది''. అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తాను క్వాలిటీపరంగా మంచి చిత్రం తీయాలనే ఈ రంగంలో ప్రవేశించాను. జూలైలో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నామని తెలిపారు. ఇందులో ఆరుపాటలున్నాయనీ, ఆడియోకు మంచి స్పందనలభించిందని సంగీత దర్శకుడు ఆర్.బి.శౌరి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి రూపాకౌర్, అనంత్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కెమెరా : కిషన్‌సాగర్
ఎడిటింగ్ : కె.రవీంద్రబాబు
మాటలు : మోహన్
పాటలు : వేటూరి వెన్నెలకంటి, ఖలీల్, జయరాజ్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ఖలీల్