1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

"గౌతం బుద్ధ'' షూటింగ్ పూర్తి

పార్వతీ మెల్టన్ ప్రధాన పాత్రలో నటించిన
పార్వతీ మెల్టన్ ప్రధాన పాత్రలో నటించిన "గౌతమ బుద్ధ" తెలుగు వెర్షన్ పూర్తయింది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ రూపొందుతున్న ఈ సినిమాకు అల్లాణి శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చారిత్రక చిత్రం సద్గురు శివానంద మూర్తి రచించిన "బుద్ధ చరితం" ఆధారంగా నిర్మితమవుతోంది.

రామోజీ ఫిల్మ్ సిటీ, ఆర్కే స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, మంచిరేవుల, బీహార్, నేపాల్‌‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో బుద్ధుడిగా సునీల్ శర్మ, బింబిసారునిగా సుమన్, ఆమ్రపాలిగా పార్వతీ మెల్టన్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా.. శశి ప్రీతం సంగీత బాణీలను సమకూర్చారు.