జులై ఏడో తేదీన ‘పాట’ విడుదల
Written By: WD
Published: Fri, 29 Jun 2007 (12:59 IST)
నూతన తారాగణం మధు, జ్యోతికృష్ణ, పూనమ్ సింగార్ హీరో హీరోయిన్లుగా వి.టి.క్రియేషన్స్ పతాకంపై శివగణపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాట’ చిత్రాన్ని జూలై ఏడవ తేదీ విడుదల కానుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఓ మధురమైన పాటలా సాగిపోతుందని, ప్రస్తుతం డి.టి.యస్. జరుగుతోందని నిర్మాత చెప్పారు.
నిజమైన ప్రేమకు తిరుగులేదనే అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించామని, జోలపాటతో మొదలయ్యే మనిషి జీవితం డప్పుపాటతో కాటికి చేరుకుంటుందని, ఇలా పుట్టుక నుండి చావు వరకు ‘పాట’ మనిషి జీవితంలో పెనవేసుకుంటుంది కాబట్టే ‘పాట’ అనే టైటిల్‌కు ట్యాగ్‌గా ‘రిథమ్ ఆఫ్ లైఫ్’ అని పెట్టామని నిర్మాత వివరించారు. సమ్‌థింగ్ స్పెషల్‌లాంటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రత్యేకమైన తేదీన విడుదల చేయబోతున్నామని ఆయన అన్నారు.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..