'శంకర్‌దాదా జిందాబాద్'లో యానాగుప్త
సోమవారం, 2 జులై 2007( 14:35 IST )
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రంలో ప్రముఖ మోడల్ నటి యానాగుప్త ఓ పాటలో తన అంద చందాలను ఆరబోయనుంది. గతంలో 'మన్మథ', 'అపరిచితుడు', 'ఘర్షణ' చిత్రాల్లో ఐటం పాటల్లో చిందులు వేసిన యానా.. తాజాగా 'శంకర్‌దాదా..' చిత్రంలో మరో మారు తెలుగు వెండి తెరపై దర్శనమివ్వనుంది.
హిందీలో సంచలన విజయం సాధించిన 'లగేరహో మున్నాభాయ్' చిత్రానికి సీక్వెల్స్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఇందులో రెండు పాటలను హీరోయిన కరిష్మా కోఠక్‌పై ఇటీవల ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. మరో పాటను పద్మాలయ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో యానాగుప్తా, మెగాస్టార్‌పై చిత్రీకరించనున్నారు.
అలాగే మిగిలిన పాటలను కూడా హైదరాబాద్‌లోని చిత్రీకరించేందుకు నిర్మాత, దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ చిత్రం ఆడియో ఈనెల నాలుగు లేదా ఐదు తేదీల్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానుంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను త్వరగా పూర్తి చేసి ఈనెల 12 లేదా 19వ తేదీల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.