రవితేజ చిత్రం ప్రారంభం
సోమవారం, 9 జులై 2007( 19:17 IST )
రవితేజ, త్రిష హీరోహీరోయిన్లుగా లక్ష్మీనరసింహ విజువల్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. వివి వినాయక్ దర్శకుడు. బి.కాశీ విశ్వనాథమ్ నిర్మాత. డివివి దానయ్య సమర్పకుడు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కేంద్రమంత్రి దాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, యనమల రామకృష్ణూడు కెమేరా స్విచ్చాన్ చేశారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు మాట్లాడుతూ, అల్లరి చిల్లరిగా తిరిగే వ్యక్తి ఓ అమ్మయి ప్రేమలోపడి ఆమె ఆశయంకోసం ఏవిధంగా తోడ్పడ్డాడు అనేది కథాంశం. నా చిత్రాల్లో ఉండే ఫ్లాష్‌బ్యాక్ అంశాలేవీ లేకుండా కొత్తదనంగా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీని రూపొందిస్తున్నాను. ఇందులో ఐ మాత్రం యాక్షన్ ఉన్నా అది ప్రేమకోసం చేసే ఫైట్సే. ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ విజయవాడలో ప్రారంభమవుతోంది. ఆరు పాటలున్నాయి. ఒక్కపాటను పుకెట్‌ఐలాండ్‌లో ఆగస్టులో చిత్రీకరిస్తామన్నారు. వివి వినాయక్‌తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకున్నది ఇవాళ నెరవేరింది. నా చిత్రాల్లో ఉండేకామెడీ ఇందులో ఉంటుంది. దాదాపు కమేడియన్స్ అంతా నటించడం విశేషమన్నారు. రవితేజతో రెండవసినిమా అనీ, వినాయక్‌తో మొట్టమొదటి చిత్రమని సమర్పకుడు డివివి దానయ్య తెలిపారు.
ఇంకా షాయాజీషిండే, ప్రదీప్‌రావత్, చంద్రమోహన్, సుధ, సన తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఛోటా కె.నాయుడు, సంగీతం రమణగోగుల, ఫైట్స్ రామ్‌లక్ష్మణ్, కథ సంభాషణలు, శివ ఆకుల, స్ర్కీన్‌ప్లే దర్శఖత్వం వివి వినాయక్.