1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

''తులసి'' సెన్సార్ పూర్తి

వెంకటేష్ నయనతార తులసి చిత్రం సెన్సార్
WD PhotoWD
వెంకటేష్, నయనతార నటించిన 'తులసి' చిత్రం సెన్సార్ పూర్తయిందనీ, 'యుఎ' సర్టిఫికేట్ పొందిందనీ, ఈ నెల 12న విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాత డి. సురేష్ బాబు మంగళవారం ప్రకటించారు. చిత్రం గురించి చెబుతూ 290 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నట్లు తెలిపారు.

వెంకటేష్ చిత్రాల్లో ఎక్కువగా హృద్యమైన సన్నివేశాలుంటాయనీ, వీటితోపాటు యాక్షన్, రొమాన్స్‌కి కూడా ఈ చిత్రంలో చోటుందన్నారు. అదేవిధంగా 500 మంది పిల్లల్ని పరిశీలించి అతులిత్‌ను తీసుకున్నామనీ. ఎక్స్ ట్రార్డినరీ ఫెర్మార్మెన్స్ ఇచ్చాడనీ, శ్రియ ఓ ప్రత్యేక పాటలో కనిపిస్తుందన్నారు. ఇది వెంకటేష్‌కు మంచి చిత్రమవుతుందన్నారు.

రచయిత పరచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, వెంకటేష్ అభినయం ప్రేక్షకులను కట్టడిచేస్తాయి. ఇది ఓ హై ఓల్టేజ్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పుకోవచ్చు. మేము మూడువంద చిత్రాలచేస్తే అందులో గుర్తుపెట్టుకొనేవి ఓ 20 సినిమాలుంటాయి. అలాగే వెంకటేష్‌కు కూడా మూడు నాలుగు చిత్రాలుంటాయి. ఆ జాబితాలో తులసి చేరుతుంద'న్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT