1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ''జయం'' జంట

'జయం' చిత్ర కాంబినేషన్‌ మరో చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ కథానాయకుడు నితిన్
FileFILE
'జయం' చిత్ర కాంబినేషన్‌ మరో చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ కథానాయకుడు నితిన్, సదా నటించిన 'జయం' చిత్రం లోగడ సూపర్ డూపర్ హిట్‌ను సాధించిన విషయం తెల్సింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో 'టక్కరి' చిత్రం రూపుదిద్దుకుటోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరచూరి శివరామ్ ప్రసాద్ నిర్మిస్తున్న 'టక్కరి' చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి 'అమ్మ' రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, చక్రీ సంగీతం సమకూర్చారు. దీనిపై నిర్మాత శివరామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. నితిన్-సదా జంట అనగానే 'జయం' సినిమా గుర్తుకువస్తుందని, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం 'టక్కరి' అన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందన్నారు. మిగిలిన పాత్రల్లో చంద్రమోహన్, సాయాజీ షిండే, ఆలీ, రఘుబాబు, సత్యం రాజేష్, సుధ, గీతాసింగ్, వేణు, బేబి త్రిష తదితరులు నటించారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి