ఛానల్ ''రిపోర్టర్''గా అనసూయ
|
దర్శకుడు మాట్లాడుతూ, చిత్ర కథ జర్నలిస్టు అనసూయ చుట్టూ తిరుగుతుంటుంది. చిన్న పట్టణంలో పెరిగిన ఓ అనాథ యువతికి సామాజిక స్పృహ ఉండటంతో జర్నలిజంలోకి ప్రవేశిస్తుంది. విధి నిర్వహణలో ఆమెకు ఎదురైన అనుభవాల సమాహారమే ఈ చిత్రం. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రేమ, సెంటిమెంట్, సస్పెన్స్ కూడా ఉంటాయన్నారు.
కథానాయకి భూమిక మాట్లాడుతూ... నా కెరీర్‌కు సవాల్ లాంటి పాత్రను పోషిస్తున్నాను. దర్శకులు పాత్రను చక్కగా మలిచారు. నాతోపాటు అందరికీ ఈ సినిమా మంచి పేరు సంపాదించిపెడుతందని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో నిఖిత, అంకిత, హర్షవర్థన్, మేల్కొటే, రవిబాబు,రేవతి తదితరులు నటిస్తున్నారు.
