1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

డిసెంబర్‌లో మహారాజశ్రీ విడుదలకు సన్నాహాలు

డిసెంబర్‌ మహారాజశ్రీ విడుదల సన్నాహాలు
WD PhotoWD
రిషి, నిఖిత, అనుమెహతా హీరోహీరోయిన్‌లుగా రూపొందుతున్న మహారాజశ్రీ చిత్రాన్ని సాయికృష్టా ప్రొడక్షన్స్ బేనర్‌పై చిత్రీకరిస్తున్నారు. రాశి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ఎస్ఎస్ నివాస్ దర్శకత్వ సారథ్యాన చిత్రీకరిస్తున్నారు. డిఎస్ రావు నిర్మాణ సారథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన డీటీఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు పూర్తి చేస్తుంది.

ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‍‌గా రూపొందుతున్న ఈ చిత్రం వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో సాగుతుందని చెప్పారు. శ్రీలేఖ సంగీతం, చంద్రబోస్, భాస్కరభట్ల సాహిత్యం ఈ చిత్రానికి హైలెట్ అవుతాయని ఆయన అన్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభించిందని తెలిపారు.

ఇందులో సునీల్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, ఆయనపై కాలేజీ సాంగ్ కూడా చిత్రీకరించామని చెప్పారు. ఈ చిత్రంలో ఇంకా బ్రహ్మానందం, సునీల్, అల్లరి సుభాషిణి, అభినయశ్రీలతో కామెడీ సన్నివేశాలు బావుంటాని తెలిపారు. వినోద్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 8న 33 ప్రింట్‌లతో విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అలాగే మంచి చిత్రంగా ప్రేక్షకుల ఆదరణకు గురికాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
About Writer
Hanumantha Reddy