కృష్ణభగవాన్, సిమ్రాన్‌ల జాన్ అప్పారావ్ 40+
|
నవంబర్ వారాంతంలో రెండు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకరిస్తున్నామని దర్శకనిర్మాత చెప్పారు. బ్యాంకాక్, పట్టాయ్, థాయ్‌లాండ్, పుకెట్ ఐలాండ్‌లలోని అందమైన లొకేషన్‌లలో పాటలు తీస్తున్నామని చెప్పారు. అలాగే మరో పాటను రామోజీ ఫిలిం సిటీలో సెంట్ సాంగ్ తెరకెక్కించడంతో షూటింగ్ భాగం పూర్తవుతుందని తెలిపారు.
ఈ చిత్రాన్ని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే తెరకెక్కిస్తున్నామని చెప్పారు. అలాగే కృష్ణభగవాన్, సిమ్రాన్ కాంబినేషన్‌లో ఇది మంచి చిత్రమవుతుందని తెలిపారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఈ చిత్రంలో ఇంకా మారుతీ, గౌతంరాజు, రుతిక, అరుణ, పృథ్వీరాజ్, అప్పాజీ, రాజేష్, షిండే, ఆలీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సంగీతం కిరణ్ వారణాసి అందిస్తుండగా, ఫైట్స్ రామ్‌లక్ష్మణ్ ఇస్తున్నారు.
