1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

నాగార్జున ''డాన్'' పాటలు విడుదల

నాగార్జున డాన్ పాటలు విడుదల
WD
నాగార్జున, అనుష్క కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'డాన్' చిత్రం ఆడియో బుధవారం రాత్రి మాదాపూర్ శిల్పకళా వేదిక ఆడిటోరియంలో జరిగింది. ఆదిత్య ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. మొదటి క్యాసెట్‌ను అక్కినేని నాగేశ్వరరావు విడుదల చేసి బి.గోపాల్‌కు అందజేశారు. అనంతరం ఆడియో సీడీని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించి ఎస్.ఎస్. రాజమౌళికి అందజేశారు.

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.... "డాన్ కథ గురించి అడగొద్దు. ఎందుకంటే కథ అంతగా ఉండదు. కానీ స్టయిలిష్‌గా ఉంటుంది. చెప్పాలంటే హాలీవుడ్ చిత్రాలను గుర్తుకుతెస్తుంది. చాలా కాలం తరువాత ఓ వైవిధ్యమైన చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో యాక్షన్ హైలెట్‌గా నిస్తుంది. నిజం చెప్పాలంటే డిసెంబరు నెల అంటే నాకు చాలా ఇష్టం. నేను నిర్మించిన సత్యం, నాకు విజయం తెచ్చిపెట్టిన మన్మథుడు, మాస్ విడుదలైంది ఈ నెలలోనే. అందుకే డిసెంబరు 20న డాన్‌ను విడుదల చేస్తున్నా"మన్నారు
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT