వడ్డే నవీన్ బాలరాజు-బంగారు కోడి చిత్రం
|
దేవిక ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం కంకణాల శివరాం రెడ్డి దర్శకత్వ సారథ్యంలో చిత్రీకరిస్తున్నారు. సురేష్ ఆకుల నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మళయాళ తార వందనామీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
హైదరాబాద్‌లో బుధవారం రామానాయడు స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ వినోదాన్ని ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. సాయినాథ్ అందించిన కథ, తర్వాత మాధవపెద్ది సురేష్ బాణీలు ఈ చిత్రానికి హైలెట్ కానున్నాయని తెలిపారు.
చక్రవాకం ఫేం.. బంటి ఈ చిత్రంలో ఓ గీతాన్ని ఆలపిస్తున్నారు అని చెప్పారు. ఈ చిత్రానికి పాటలు సుద్దాల అశోక్‌తేజ, వనమాలి, వేల్పుల వెంకటేష్, జయసూర్యలు అందిస్తుండగా, దర్శకత్వం కంకణాలు శివరాం రెడ్డి బాధ్యత వహిస్తున్నారు.
