డిసెంబర్ 7న స్టేట్ రౌడీ చిత్రం
శివాజీ, మల్లికాకపూర్, మధుశాలిని హీరోహీరోయిన్‌లుగా రూపొందిన స్టేట్ రౌడీ చిత్రం విక్రమ్ గాంధీ దర్శకత్వ సారథ్యాన చిత్రీకరించారు. శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు సంయుక్త నిర్మాణ సారథ్యంలో చిత్రీకరించిన ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు ప్రస్తుతం పూర్తయ్యాయి.
దీంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదల చేయాలనకుంటున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ మిస్సమ్మ చిత్రంతో తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైతే ఈ చిత్రం ద్వారా మాస్ ప్రేక్షకులకు దగ్గర కానున్నట్లు తెలిపారు.
తనకు మంచి పేరు రాగలదని ఆశిస్తున్నట్లు విక్రమ్ గాంధీ వెల్లడించారు. అనంతరం కెమెడియన్ నటుడు వేణుమాధవ్ మాట్లాడుతూ ఇందులో నా పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పారు. ఉద్యోగం చేసేందుకు వచ్చిన ఓ యువకుడ్ని స్టేట్ రౌడీగా మార్చేసి అతని జీవితం కీలక మలుపు తిరగడంలో ప్రధాన పాత్ర వహించానని తెలిపాడు.
శ్రీలేఖ సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని తెలిపాడు. తమిళంలో ఎదిరి అనే తమిళ చిత్రం ఆధారంగా స్టేట్ రౌడీ(వీడికంత సీన్‌లేదు) చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పాడు.