1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

మొగుడు పెళ్లాం ఓ బోయ్ ఫ్రెండ్ త్వరలో

మొగుడు పెళ్లాం ఓ బోయ్ ఫ్రెండ్
WD PhotoWD
శ్రీధర్ సమర్పణలో రూపొందుతున్న మొగుడు పెళ్లాం ఓ బోయ్ ఫ్రెండ్ చిత్రం రవి శ్రీవాత్సవ్ దర్శకత్వ సారథ్యాన చిత్రీకరించారు. మురళీమోహన్, వల్లభనేని వెంకటేశ్వరరావు సంయుక్త నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్మాతలు మాట్లాడుతూ ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించామని చెప్పారు. కన్నడ చిత్రం గండహెళిదె చిత్రం ఆధారంగా తెలగులో రూపొందించామని స్పష్టం చేశారు.

ప్రశాంతంగా సాగుతున్న కాపురంలో అనుకోనివిధంగా భార్యకు సంబంధించి ఓ బోయ్‌ఫ్రెండ్ ప్రవేశిస్తే వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు సంభవించాయన్న విషయాన్ని చిత్రంలో చర్చించామని చెప్పారు. అలాగే చేసిన అలాంటి తప్పును ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాన్ని అద్భుత రీతిలో తెరకెక్కించామని తెలిపారు.

ఈ చిత్రంలో సంజన, విశాల్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తుండగా.. బోయ్ ఫ్రెండ్‌గా తిలక్ నటించాడు..
About Writer
Hanumantha Reddy