కిడ్నాప్, సస్పెన్స్ అంశాలతో మిస్సింగ్..
|
మూడు పాటలున్న ఈ చిత్రం ఆరుగురు జూనియర్ డాక్టర్లు... వారి మధ్య కిడ్నాప్, చోరీలు, సస్పెన్స్ తదితర కీలక అంశాల నేపథ్యంలో కథ సాగుతుందని తెలిపారు. అలాగే ఫైనల్ హైలెట్‌గా అతీంద్రియ శక్తులనే అంశాన్ని కూడా ఇందుకు జత చేసినట్లు పేర్కొన్నారు.
అనంతరం ఎగ్జిక్యూటివ్ నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన దానిలో హార్రర్ అంశాలు చక్కగా వచ్చాయని... పూర్తి కమర్షియల్ పిక్చర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. గతంలో వచ్చిన ఎ ఫిలిం బై అరవింద్ చిత్రం కన్నా మిస్సింగ్ చిత్రంలో సన్నివేశాలు ప్రేక్షకులను మరింత థ్రిల్‌కు గురి చేయగలవని ఆయన చెప్పారు.
గీత రచయిత బాలాజీ మాట్లాడుతూ అల్లేశావ్ హివల్లేశావ్.. అనే పాటను తాను రాయగా.. గాయని రాధికా సక్సేనా ఆలపించారని తెలిపారు... తప్పకుండా ఈ చిత్రం మంచి పేరు సంపాదిస్తుందని చెప్పారు.

