1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

సాయివెంకట్ దర్శకత్వంలో స్టూడెంట్ లైఫ్

సాయివెంకట్ దర్శకత్వం స్టూడెంట్ లైఫ్
WD PhotoWD
సాయివెంకట్ దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న స్టూడెంట్ లైఫ్ చిత్రం సుదర్శన్ ప్రొడక్షన్స్ బేనర్‌పై చిత్రీకరిస్తున్నారు.. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సందర్భంగా సాయివెంకట్ మాట్లాడుతూ ఈ చిత్రానికి టైటి‌ల్‌తో పాటు గోల్డన్ లైఫ్‌ అన్న సబ్ క్యాప్షన్‌ను కూడా జోడించామన్నారు...

ఇందులో సీనియర్, జూనియర్‌ల మధ్య చిత్రీకరించిన ర్యాగింగ్ సన్నివేశాలను చక్కగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. తాము గతంలో వేణుమాధవ్ హీరోగా.. భూకైలాస్‌ 'ఎకరానికి యాభై కోట్లు'.. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను హీరో వృషభ్, గుండు హనుమంతురావు, శివప్రసాద్‌లపై పేరడీగా చిత్రీకరిస్తున్నామన్నారు...

ఇందులో కథానాయకుడుగా నటిస్తున్న పాట చిత్రం ఫేమ్ మధుసూదన్... వృషభ్‌‌గా రానుండగా.. హీరోయిన్ ఆషాశైని... మూయూరిగా పేరు మార్చుకుని నటిస్తున్నట్లు చెప్పారు... అనంతరం గుండు హనుమంతరావు మాట్లాడుతూ సాయి వెంకట్ రూపొందించిన యువకులు చిత్రంలో తాను నటించానని చక్కని ప్లానింగ్ ఉన్న దర్శకుడని ప్రశంసించాడు..

తర్వాత వృషభ్ మాట్లాడుతూ పాట చిత్రం తర్వాత చాలా అవకాశాలు వచ్చాయని.... అయితే అందులో సాయి వెంకట్ గారు చెప్పిన కథ నా కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చిందని.. చెప్పాడు.. ఈ చిత్రం నా సినీ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు.
About Writer
Hanumantha Reddy