ప్రేమ, కుటుంబం ప్రధానాంశంగా కొత్త చిత్రం
|
పలువురు సినీరంగ ప్రముఖులు షూటింగ్ కార్యక్రమానికి విచ్చేశారు... రామన్ దర్శకత్వ సారథ్యంలో రూపొందే ఈ చిత్రంలో హీరోగా క్రాంతి నటిస్తున్నాడు.. అలాగే కుసుమ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రెండు పాటలు రికార్డింగ్ పూర్తి అయ్యింది.
డిసెంబర్ నెలాఖరుకు షూటింగ్ ప్రారంభించి... అలాగే ఫిబ్రవరిలోగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు చెప్పారు... ఈ చిత్రానికి సంగీతం డ్రమ్స్ రాము అందిస్తుండగా... మాటలు ఫణి ఇస్తున్నారు.. పాటలు బాబూ రావు ఇస్తున్నారు..

