1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఎంఎస్ రాజు వాన ఆడియో త్వరలో

ఎంఎస్ రాజు వాన ఆడియో త్వరలో
WD PhotoWD
సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాతగా పేరొందిన ఎంఎస్ రాజు నిర్మాణ సారథ్యంలో, స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న వాన చిత్రం సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ పతాకంపై చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా జనవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ కమలాకర్ సంగీత సారథ్యంలో చక్కని బాణీలు కుదిరాయని... సంగీత దర్శకునికి ఇదో బ్రేక్ చిత్రం అవుతుందని చెప్పారు... ఇప్పటి వరకు మా బేనర్‌లో విడుదలైన దాదాపు అన్ని చిత్రాల పాటలను ప్రేక్షకులు మ్యూజికల్ హిట్స్ చేశారు..

కనుక ఈ చిత్రంలోని పాటలను కూడా ప్రేక్షకులు ఆదరించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. పాటలు పూర్తిగా కథలో భాగంలాగా వైవిధ్యంగా ఉంటాయని.. కథలో మరింత డెప్త్‌నెస్ పెంచుతుందని ఆయన చెప్పారు. ఈ చిత్రం యూత్‌తో పాటు.. క్లాస్.. మాస్.. ప్రేక్షకులను ఆకట్టుకోగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కన్నడ భాషలో హిట్ అయిన ముంగారమలై అనే చిత్రం ఆధారంగా వాన చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. ఈ చిత్రంలోని ఓ పాటను చెప్తూ ప్రేమ మధురం... త్యాగం అమరం.. మా వాన చిత్రానికి ఇదే మూలం... అంటూ పూర్తి చేశారు.... ఎంఎస్ రాజు...
About Writer
Hanumantha Reddy