1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఆర్కే ఫిలింస్ పతాకంపై మండే టు సండే

ఆర్కే ఫిలింస్ పతాకం మండే టు సండే
WD PhotoWD
ఆర్కే ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న మండే టు సండే చిత్రం మారుతీ నరేంద్రనాధ్ దర్శకత్వ సారథ్యాన చిత్రీకరిస్తున్నారు... యువరాజ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా నరేంద్రనాధ్ మాట్లాడుతూ యూత్ ప్రధానాంశంగా తెర కెక్కించే ఈ చిత్రంలో వెరైటీ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. తనను ప్రేమిస్తున్న ఏడుగురు వ్యక్తులకు అందమైన యువతి పెట్టిన వెరైటీ పరీక్ష ప్రధానాశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామన్నారు.

ఇక నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిపి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రానున్న ఫిబ్రవరి కంతా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నరేంద్ర తెలిపారు. కథారచయిత వందవ్యాస విద్య కథ గురించి మాట్లాడుతూ మానసికంగా స్పందించేది ప్రేమ అయితే.. శారీరకంగా స్పందించేది ఆకర్షణ అన్న దానిపై కీలకంగా తెర కెక్కించనున్నమని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం స్వామినాథన్ సమర్పింస్తుండగా.. కెమెరా పి శ్రీనివాసరావు షూట్ చేస్తున్నారు... ఇందులో చక్కని సంభాషణలు కుదిరాయన విద్య అన్నారు.
About Writer
Hanumantha Reddy