గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » జనవరిలో "బ్రహ్మానందం డ్రామా కంపెనీ..."
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
WD PhotoWD
గిన్నీస్‌బుక్ రికార్డర్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో శివాజీ-రవికృష్ణలు హీరోలుగా నిర్మితమవుతున్న చిత్రం "బ్రహ్మానందం డ్రామా కంపెనీ - హీరోయిన్ జంప్". శ్రీ రామచంద్రులు ఫిలిమ్స్ పతాకంపై పల్లి కేశవరావు, కె.కిషోర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ లోగోను ఇటీవల హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రముఖ దర్శకుడు వివి.వినాయక్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ వినగానే నవ్వు వచ్చింది. నా చిత్రాల్లో ఆయన ఉన్నంతసేపూ బాగా ఎంజాయ్ చేస్తాను. ఆయన ఎలా గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడో.. అలాగే ఈ చిత్రం కూడా గిన్నిస్ బుక్‌లో చేరుతుందన్నారు. ఈ సినిమాలో తాను ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు హాస్యనటుడు బ్రహ్మానందం తెలిపారు.

అనంతరం చిత్ర నిర్వాహకులు సోమా విజయప్రకాష్ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ ఇంత బాగుంటే.. చిత్రం ఇంకెంత బాగుంటుందో ఊహించుకోవచ్చన్నారు. ఇప్పటికే చిత్రం షూటింగ్ 90శాతం మేరకు పూర్తి చేశామన్నారు. మిగిలిన పార్టు పూర్తి చేసి, జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.