ఆకాష్ హీరోగా నేస్తమా చిత్రం
|
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయిన సందర్భంగా వీరేంద్ర మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగిన షెడ్యూల్‌తో చిత్ర షూటింగ్ పూర్తయిందని చెప్పారు. రాగా మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరిలో ఆడియోను, ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలను చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో ఇంకా ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రమణ్యం, విజయ్, బ్రహ్మానందం, ఢిల్లీ రాజేశ్వరి, గుండు హనుమంతరావు, సురేఖావాణి నటిస్తుండగా... కథను లంకా శివశంకర్ సమర్పిస్తున్నారు. అలాగే మాటలు డీబీ చారి ఇస్తుండగా, సంగీతం జాయ్ క్వాలిస్ అందిస్తున్నారు.
